Sachin Tendulkar : సచిన్ టెండుల్కర్ సెన్సేషనల్ పోస్ట్... గంగూలీ హాట్ కామెంట్...

Sachin Tendulkar Instagram Post : ఆస్ట్రేలియా బుష్ ఫైర్ బాష్ మ్యాచ్ దృష్ట్యా మెల్‌బోర్న్ వచ్చిన సచిన్ టెండుల్కర్... తన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు.

news18-telugu
Updated: February 14, 2020, 3:02 PM IST
Sachin Tendulkar : సచిన్ టెండుల్కర్ సెన్సేషనల్ పోస్ట్... గంగూలీ హాట్ కామెంట్...
Sachin Tendulkar : సచిన్ టెండుల్కర్ సెన్సేషనల్ పోస్ట్... గంగూలీ హాట్ కామెంట్... (credit - Insta - sachintendulkar)
  • Share this:
Sachin Tendulkar Instagram Post : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ ఎవర్ గ్రీన్. ఆయన క్రికెట్‌ని వదిలేసి చాలా కాలం అయినా... అభిమానులు మాత్రం ఆయన్ని వదల్లేదు. సచిన్ ఎప్పుడు ఏం చెప్పినా, సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా... ఫ్యాన్స్ ఖుషీ అవుతూనే ఉంటారు. తాజాగా ఆయన ఆస్ట్రేలియాలో తిరుగుతూ... అందుకు సంబంధించి రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. వాటిలో ఒక దాంట్లో సచిన్... మెల్‌బోర్న్‌లోని సౌత్‌బ్యాంక్ పార్కులో కూర్చున్నాడు. సూర్యుడి వేడిని ఎంజాయ్ చేస్తున్నానని కాప్షన్ పెట్టాడు. ఫ్యాన్స్ ఆటోమేటిక్‌గా ఈ పిక్‌కి లైక్స్, షేర్స్ కొట్టారు. ఐతే... మాజీ కెప్టెన్, ప్రస్తుత BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై స్పందించడం చర్చనీయాంశమైంది. "కొంత మందికి అదృష్టం కలిసొస్తుంది. హాలిడేస్‌ని ఎంజాయ్ చెయ్" అని కామెంట్ రాశాడు బెంగాల్ దాదా. దాంతో ఇప్పుడు అంతా ఆ కామెంట్‌పై స్పందించడం మొదలుపెట్టారు.








View this post on Instagram





Soaking up the Sun 🌞!


A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on





గంగూలీ కామెంట్‌కి టెండుల్కర్ కూడా రిప్లై ఇచ్చాడు. తాను సరదా కోసం రాలేదనీ, ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్ (కార్చిచ్చు) క్రికెట్ మ్యాచ్ (నిధుల సమీకరణ కోసం ఆడిన మ్యాచ్) ద్వారా 10 మిలియన్ డాలర్లు సేకరించారని రిప్లై ఇచ్చాడు. దాంతో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ డిబేట్‌లో పాల్గొని సచిన్‌ను ట్రోల్ చేశాడు. 46 ఏళ్ల టెండుల్కర్... రిటైర్మెంట్ తీసుకొని మళ్లీ ఓ ఓవర్ ఆడేందుకు ఓవల్ జంక్షన్‌కి వచ్చాడు అని ట్రోల్ చేశాడు.








View this post on Instagram





‪Strolling 🚶‍♂ in Sydney! ‬ ‪Visiting this beautiful city after a while. Love being Down Under.‬


A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on





తన కెరీర్‌లో వన్డేల్లో దుమ్మురేపిన సచిన్ టెండుల్కర్... బుష్‌ఫైర్ క్రికెట్ బాష్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా ఆల్ రౌండర్ ఎల్లిసే పెర్రీ వేసిన స్పెషల్ ఓవర్‌ను ఎదుర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)... ఆస్ట్రేలియాలో కార్చిచ్చులో గాయపడిన ప్రాణుల్ని కాపాడేందుకు విరాళాల సేకరణ కోసం ఈ మ్యాచ్ నిర్వహించింది. ఆస్ట్రేలియా కార్చిచ్చులో 33 మంది చనిపోగా... వేల ఇళ్లు తగలబడిపోయాయి.
Published by: Krishna Kumar N
First published: February 14, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading