SACHIN TENDULKAR ONE OF THE MOST DIFFICULT BATSMEN BOWLED TO IAN BISHOP
నా కెరీర్లో అతనే అత్యంత కష్టతరమైన బ్యాట్స్‌మెన్
సచిన్ టెండూల్కర్ (ఫైల్)
Last Updated:
Share this:
వెస్టిండీస్ మాజీ పేసర్, వ్యాఖ్యాత ఇయాన్ బిషప్.. సచిన్ తెందూల్కర్‌పై ప్రశంసల జల్లు కురింపించారు. దిగ్గజ బ్యాట్సమన్ సచిన్ తెందూల్కర్‌కు బౌలింగ్ చేయడం కష్టతరమన్నారు. తాజాగా ‘క్రికెట్ కనెక్టెడ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఈ విండీస్ మాజీ ఫ్లేయర్.. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ బ్యాట్సమన్ సచిన్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నారు. "నా కెరీర్లో ఇప్పటికి వరకు సచిన్ మాత్రమే ప్రత్యేకమైన ఆటగాడిగా కనిపించాడు. నేను చాలా మంది దిగ్గజ బాట్స్‌మెన్స్‌కు బౌలింగ్ చేశాను. వారిలో లిటిల్ స్టార్ స్పెషల్. స్ట్రైట్డ్రైవ్లను బాగా ఆడగలడు. ఆ టెక్నిక్‌తో చాలా ఈజీగా బంతిని బౌలర్ల వెనిక్కి పంపించేస్తాడంటూ" సచిన్ బ్యాటింగ్‌ను బిషన్ కొనియాడారు.
90వ దశకంలో బౌలర్‌గా ఓ వెలుగు వెలిగిన బిషప్ ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేశాడు. ‘క్రికెట్ కనెక్టెడ్’ పోగ్రాంలో పాల్గోన్న అతను గత అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు. సచిన్‌తో బిషన్ నాలుగు టెస్టులు,ఐదు వన్డేలు ఆడారు. వాటిలో సచిన్‌ను మూడు సార్లు మాత్రమే అవుట్ చేశాడు. ఆ తోమ్మది మ్యాచ్‌ల్లోనే తెందూల్కర్ డాషింగ్ బ్యాటింగ్ ఏంటో ఆర్థం చేసుకోగలిగాడు ఈ వీండిస్ దిగ్గజ బౌలర్.