HOME »NEWS »SPORTS »sachin tendulkar loses close friend vijay shirke due to coronavirus srd

Sachin Tendulkar : కరోనాతో దిగ్గజ క్రికెటర్ స్నేహితుడు మృతి.. అతడు కూడా క్రికెటరే..

Sachin Tendulkar : కరోనాతో దిగ్గజ క్రికెటర్ స్నేహితుడు మృతి.. అతడు కూడా క్రికెటరే..
Sachin losts Close Friend due to corona

Sachin Tendulkar : కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎవర్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో షేక్ అవుతున్నాయ్. ఈ మహమ్మారి కారణంగా లెజెండరీ బ్యాట్స్ మన్ సచిన్ మరో స్నేహితుణ్ని కోల్పోయాడు. అతడు కూడా క్రికెటరే..

  • Share this:
    కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎవర్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో షేక్ అవుతున్నాయ్. ఈ మహమ్మారి కారణంగా లెజెండరీ బ్యాట్స్ మన్ సచిన్ మరో స్నేహితుణ్ని కోల్పోయాడు. అతడు కూడా క్రికెటరే. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విజయ్ షిర్కే 80 వ దశకంలో సుంగ్రెస్ మాఫట్లాల్ జట్టుకు క్రికెట్ ఆడాడు. ఈ జట్టులో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి కూడా ఆడారు. తన స్నేహితుడి మరణంపై వినోద్ కాంబ్లీ స్పందించారు. " ఎంతో విషాదకరమైన వార్త. నా ప్రాణ స్నేహితుణ్ని కోల్పోవడం ఎంతో బాధాకరం. అతన్ని నేను, సచిన్ విజ్జా అని ముద్దుగా పిలిచేవాళ్లం " అని ఆవేదన వ్యక్తం చేశాడు.

    " విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. వారం రోజుల క్రితమే అతనితో మాట్లాడాను. కానీ మూడు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ లు రావడం లేదు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందని" బాధ పడ్డాడు.



    విజయ్ షిర్కే ముంబై అండర్-17 టీమ్ కు కోచ్ గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా ఈ జట్టుకు కోచ్ గా పనిచేస్తున్నారు. ఆయన మరణవార్త విని ప్రముఖ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా.. ఇప్పటికే ఒక స్నేహతుణ్ని కోల్పోయాడు సచిన్. అక్టోబర్ లో కరోనాతో అవి కాదం చనిపోయాడు. ఇప్పుడు విజయ్ షిక్రే కూడా కరోనాతో చనిపోయారు.
    Published by:Sridhar Reddy
    First published:December 21, 2020, 13:06 IST

    टॉप स्टोरीज