క్రికెట్ లెజెండ్ సచిన్ (Sachin Tendulkar) టెండూల్కర్ పారాసైలింగ్ (Parasailing) చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఇప్పటికే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంతా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంటే సచిన్ (Sachin) కూడా ఇప్పుడు ఈలిస్ట్ లో చేరిపోయి, తన లీజర్ వెకేషన్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సచిన్ ఎక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ Covid-19 కోవిడ్-19 తరువాత సరదాగా పారాసైలింగ్ (Parasailing) చేసిన సచిన్ వీడియో మాత్రం ఇప్పుడు అందరి మదిని దోస్తోంది.
హమ్ తో ఉడ్ గయే..
47 ఏళ్ల సచిన్ తన పారాసైలింగ్ (Parasailing) చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ "హమ్ తో ఉడ్ గయే" (మేం ఎగురుతున్నాం) అన్న క్యాప్షన్ ఇచ్చారు. తన కుమారుడు అర్జున్ తో కలిసి ఉన్న ఫొటో కూడా పోస్ట్ చేసిన సచిన్ 'వెకేషన్ వైబ్స్' (vacation vibes) అంటూ పెట్టిన ఇన్ స్టా ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరో వీడియోలో సైక్లింగ్ (Cycling) చేస్తూ కనిపించిన సచిన్ (Sachin Tendulkar) తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు వెకేషన్ (Vacation) హైలైట్స్ ను అప్ డేట్ చేస్తున్నారు. సచిన్ (Sachin) పోస్టింగ్స్ కు మిలియన్లకొద్దీ లైకులు వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సచిన్ కరోనా మహమ్మారి coronavirus సమయంలోనూ తన ఫ్యాన్స్ ను ఊరడిస్తూ, క్రికెట్ (Cricket) పై తన మనసులో మాటను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఫ్యామిలీ ఫోటోలు, వంటలు, తమాషా విషాయలను భలే షేర్ చేసే సచిన్ (Sachin) ఇన్ స్టా గ్రాం (Instagram) లో ఏకంగా 27.4 మిలియన్ల ఫాలోయర్లు ఫాలో అవుతున్నారు.
సచిన్ (Sachin) పోస్ట్ చేస్తున్న ఈ ఫొటోలు, వీడియోలు చాలా బావున్నాయి. తన అడ్వెంచర్ ట్రిప్ ను సచిన్ (Sachin Tendulkar) షేర్ చేసేకొద్దీ ఇంతకీ సచిన్ ప్రస్తుతం ఎక్కడ వెకేషన్ (vacation) చేసుకుంటున్నారంటూ నెటిజన్లు ఆరాతీస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ (Master blaster) సచిన్ (Sachin Tendulkar) పారాసైలింగ్ (Parasailing) చూసిన నెటిజన్లు తాము కూడా ఇలా హాయిగా గాల్లో ఎగిరితే ఎంతబావుండో అని ఊహల్లో తేలిపోతున్నారు. తన కుటుంబంతో ఇలా హాలిడేస్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్న సచిన్ పారాసైలింగ్ (Parasailing) వీడియోకు 24 గంటలు తిరిగేలోగా 3 మిలియన్లకు పైగా వ్యూస్ రావటం హైలైట్.
స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతున్న సచిన్ (Sachin) ఫొటో కూడా "క్రికెట్ గాడ్" (Cricket god) ఫ్యాన్స్ ను హ్యాపీ చేస్తోంది. సాధారణంగా సచిన్ వెకేషన్స్ (vacations) అంటే తన కుటుంబంతోనే వెళ్తుంటారు. దేశ విదేశాల్లోని ప్రముఖ హాలిడే స్పాట్స్ ను తరచూ సందర్శిస్తూ, తీరికగా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసే సచిన్ మంచి ఆహార ప్రియుడు కూడా. తరచూ తాను ట్రై చేసే వంటలు, ఇంట్లో వండిన వంటలు, అమ్మ చేతి వంటలు, తన రెస్టారెంట్ మెనూలోని కొత్త వంటల స్పెషాలిటీ వంటి విషయాలను చక్కగా వివరిస్తారు. ఇటీవలే సైనా నెహ్వాల్ వంటి స్పోర్ట్స్ స్టార్స్ అంతా మాల్దీవ్స్ లో వెకేషన్స్ (Vacation) ఎంజాయ్ చేసిరాగా ఇప్పుడు సచిన్ వంతు వచ్చిందన్నమాట. ఇక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, కూల్ గా వెకేషన్స్ (vacation) ఎంజాయ్ చేస్తున్న సచిన్ ను ఆయన అభిమానులంతా "క్రికెట్ గాడ్" (Cricket god) అని ముద్దుగా పిలుచుకుంటారు.