సచిన్ టెండూల్కర్ చేసిన పనికి షాక్...మహిళ బౌలర్‌ను బాదేశాడుగా...

సచిన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ మ్యాచ్ లో మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు. అంతేకాదు తొలి బంతినే బౌండరీగా మలిచి తన సత్తా చాటాడు.

news18-telugu
Updated: February 9, 2020, 3:49 PM IST
సచిన్ టెండూల్కర్ చేసిన పనికి షాక్...మహిళ బౌలర్‌ను బాదేశాడుగా...
(Image: Twitter)
  • Share this:
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అనంతరం మరోసారి అభిమానులను అలరించారు. క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన అనంతరం సచిన్ టెండూల్కర్ చివరిసారిగా 2014లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో కనిపించాడు. మళ్లీ ఐదేళ్లలో సచిన్ బ్యాట్ పట్టింది లేదు. అయితే సచిన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ మ్యాచ్ లో మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు. అంతేకాదు తొలి బంతినే బౌండరీగా మలిచి తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా ఇటీవల ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకుగాను ఆస్ట్రేలియా బుష్ఫైర్ క్రికెట్ బాష్ 2020 మ్యాచ్ నిర్వ‌హించారు. ఈ మ్యాచ్‌లోని రెండు జ‌ట్ల‌కు ఒక‌వైపు పాంటింగ్‌, మ‌రోవైపు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ వ‌హిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో సచిన్, యువీ స‌హా ఎంతోమంది ఉన్నారు. భార‌త్ నుంచి సచిన్ కోచ్ పాత్ర పోషిస్తుండగా.. యువీ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. మిగ‌తా వారిలో ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్, షేన్‌వార్న్‌, మ‌థ్యూ హేడెన్‌, కోట్నీ వాల్ష్‌, బ్రియాన్ లారా, జ‌స్టిన్ లాంగ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.


First published: February 9, 2020, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading