HOME »NEWS »SPORTS »sachin tendulkar and daughter sara tendulkar lost in sea interesting post leaves internet gasping for breath srd

Sachin Tendulkar : అలా విహారయాత్రలో సరదాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. అతని గారాల పట్టి సారా టెండూల్కర్

Sachin Tendulkar : అలా విహారయాత్రలో సరదాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. అతని గారాల పట్టి సారా టెండూల్కర్
తండ్రి సచిన్‌తో సారా

Sachin Tendulkar : క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం చెప్పకపోయినా తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. తాజాగా సముద్రంలో తన గారాలపట్టి సారాతో కలిసి బోటింగ్‌కు వెళ్లిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు

  • Share this:
    క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం చెప్పకపోయినా తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. తొలుత తానొక్కడే సైక్లింగ్‌ చేస్తున్న ఫొటోలు పంచుకున్న లిటిల్‌ మాస్టర్‌.. ఆ తర్వాత కుమారుడు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. ఆ తర్వాత పారా సెయిలింగ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేయగా.. తాజాగా సముద్రంలో తన గారాలపట్టి సారాతో కలిసి బోటింగ్‌కు వెళ్లిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు. తండ్రీకూతుళ్లిద్దరూ లైఫ్‌ జాకెట్స్‌ ధరించి కళ్లద్దాలు పెట్టుకొని పడవలో వెళ్తుండగా ఆ ఫొటో తీసుకున్నారు. సచిన్‌ దాన్ని ఇన్‌స్టాలో పంచుకొని ఇలా పేర్కొన్నాడు. ‘‘సారా: బాబా.. మనం సముద్రంలో తప్పిపోయామా?’ అని అడిగితే.. నాకూ కచ్చితంగా తెలియదు’’ అని సరదాగా బదులిచ్చాడు. కరోనా కారణంగా మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటున్న సచిన్‌ ఇటీవలే బయటకు రావడం మొదలుపెట్టాడు.


    సచిన్ పోస్ట్ చేస్తున్న ఈ ఫొటోలు, వీడియోలు చాలా బావున్నాయి. తన అడ్వెంచర్ ట్రిప్ ను సచిన్ షేర్ చేసేకొద్దీ ఇంతకీ సచిన్ ప్రస్తుతం ఎక్కడ వెకేషన్ చేసుకుంటున్నారంటూ నెటిజన్లు ఆరాతీస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ పారాసైలింగ్ చూసిన నెటిజన్లు తాము కూడా ఇలా హాయిగా గాల్లో ఎగిరితే ఎంతబావుండో అని ఊహల్లో తేలిపోతున్నారు. తన కుటుంబంతో ఇలా హాలిడేస్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్న సచిన్ పారాసైలింగ్ వీడియోకు 24 గంటలు తిరిగేలోగా 3 మిలియన్లకు పైగా వ్యూస్ రావటం హైలైట్.



    47 ఏళ్ల సచిన్ తన పారాసైలింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ "హమ్ తో ఉడ్ గయే" (మేం ఎగురుతున్నాం) అన్న క్యాప్షన్ ఇచ్చారు. తన కుమారుడు అర్జున్ తో కలిసి ఉన్న ఫొటో కూడా పోస్ట్ చేసిన సచిన్ 'వెకేషన్ వైబ్స్' అంటూ పెట్టిన ఇన్ స్టా ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరో వీడియోలో సైక్లింగ్ చేస్తూ కనిపించిన సచిన్ తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు వెకేషన్ హైలైట్స్ ను అప్ డేట్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:December 11, 2020, 14:36 IST

    टॉप स्टोरीज