HOME »NEWS »SPORTS »sachin tendulkar 100 provides a soothing balm to a grieving nation sa

Sachin: ఆ ఇన్నింగ్స్‌‌కు 12 ఏళ్లు... సచిన్ హృదయం కన్నీళ్లతో బరువెక్కిన వేళ!

Sachin: ఆ ఇన్నింగ్స్‌‌కు 12 ఏళ్లు... సచిన్ హృదయం కన్నీళ్లతో బరువెక్కిన వేళ!
Tendulkar dedicates Test victory to Mumbai victims (1)

ముంబై (26/11) కాల్పుల అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ తనకు ప్రత్యేకమైనదన్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఆ మ్యాచ్‌లో 103 పరుగుల ఇన్నింగ్స్‌ కెరీర్లో గుర్తిండిపోయేదన్నారు.

  • Share this:

    ముంబై (26/11) కాల్పుల అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ తనకు ప్రత్యేకమైనదన్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఆ మ్యాచ్‌లో 103 పరుగుల ఇన్నింగ్స్‌ కెరీర్లో గుర్తిండిపోయేదన్నారు. ఆ సెంచరీని మారణహోమంలో మరిణించవారికి అకింతం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ మ్యాచ్ జరిగి డిసెంబర్‌ 15 నాటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి.ఓ సారి మ్యాచ్ విశేషాలను గుర్తుచేసుకుంటే..



    ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆ మారణహోమాన్ని గుర్తుచేసుకున్నారు. "ముంబై జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటనకు తలచుకున్నప్పుడల్లా నా హృదయం బరువెక్కుతుంది.  చాల మంది అమాయక ప్రజల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను చూస్తే నా రక్తం మరిగిపోతుంది. శతృ మూకాలపై పోరాడిన ఎన్‌ఎస్‌జీ కమాండోలకు కూడా నా శతకోటి వందనాలు. ఈ సెంచరీని ఆ దమనకాండలో అమరులైన వారికి అంకితం ఇస్తున్నాని" తెలిపారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడడానికి వచ్చింది. మూడో మూడో వన్డే సమయంలోనే ముంబై దాడులు జరగడంతో ఆ తర్వాతి రెండు వన్డేలను రద్దు చేశారు. ఆ తర్వాత పటిష్ట భధ్రతా మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించారు.

    2008 నవంబరు 26 ఓ ఒక్క భారతీయుడు మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు ఉగ్రమూకలు దేశ వాణిజ్య రాజధానిలో మారణ హోమం సృష్టించారు. ముంబైలో జరిగిన ఈ మారణకాండకు ఇవాల్టీతో పదేళ్లు పూర్తయ్యాయి. నవంబర్ 26, 2008.. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై దాడులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 166మంది హతమవగా.. 300మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ పట్టుబడగా 2012 నవంబర్ 21న భారత్ అతన్ని ఉరితీసింది. ఉగ్రవాదులను అంతం చేయడానికి దేశ భద్రతా బలగాలు మూడు రోజుల పాటు శ్రమించాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అశువులుభాసాడు. నాటి ఆ ఉదంతం యావత్ ప్రపంచాన్ని షాక్‌గు గురిచేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:December 16, 2020, 07:53 IST

    टॉप स्टोरीज