SACHIN SREESANTH ALWAYS RATED YOU AS A TALENTED BOWLER CRICKET LEGEND SACHIN TENDULKAR QUOTED ON SREESANTH RETIREMENT SJN
Sachin-sreesanth: వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన వ్యాఖ్యలు
సచిన్, శ్రీశాంత్ (ఫైల్ ఫోటో)
Sachin-Sreesanth: తన ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేసిన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశాంత్ రిటైర్మెంట్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
Sachin-sreesanth: ’ఇన్ ద ఎయిర్... శ్రీశాంత్ టేక్స్ ఇట్... ఇండియా విన్‘ 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ (World cup) ఫైనల్లో కామెంటేటర్ గా రవిశాస్త్రి (Ravi Shastri) పలికిన మాటలు ఇవి. చాలా మందికి ఈ మాటలు ఇప్పుడు విన్నా చాలు... రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan) 4 బంతుల్లో 5 పరుగులు చేస్తే చాలు గెలుస్తుందన్న తరుణంలో... జోగిందర్ శర్మ వేసిన బంతిని మిస్బా ఉల్ హక్ ఫైన్ లెగ్ దిశలో ఆడతాడు. అయితే అక్కడే ఉన్న శ్రీశాంత్ (Sreesanth) క్యాచ్ అందుకోవడంతో తొలి టి20 ప్రపంచకప్ భారత్ సొంతం అవుతుంది. ఇదే ప్రపంచకప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లో మనం పటిష్ట ఆస్ట్రేలియా (Australia) తలపడతాం. ఆ మ్యాచ్ లో శ్రీశాంత్ నిప్పులు చెరుగుతాడు. తొలుత డేంజరస్ బ్యాటర్ ఆడం గల్ క్రిస్ట్ (adam gilchrist)ను అవుట్ చేసిన అతడు... మళ్లీ హెడెన్ ను పెవిలియన్ కు చేర్చుతాడు.
శ్రీశాంత్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? అదే 39 ఏళ్ల వయసులో శ్రీశాంత్ ఈ నెల 9వ తేదీన క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీశాంత్ రిటైర్మెంట్ పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) స్పందించాడు. శ్రీశాంత్ ను తానెప్పుడూ టాలెంట్ ఉన్న బౌలర్ గానే చూశానని సచిన్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత్ కు ఆరేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించినందుకు కంగ్రాట్స్ చెబుతూ అతడి సెకండ్ ఇన్నింగ్స్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
నాగ్ పూర్ వేదికగా 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా శ్రీశాంత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక భారత్ తరఫున చివరి మ్యాచ్ ను 2011 ఆగస్టులో ఇంగ్లండ్ తో ఆడాడు. శ్రీశాంత్ తన కెరీర్ లో 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టి20ల్లో 7 వికెట్లు తీశాడు. అయితే 2013లో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో శ్రీశాంత్ కెరీర్ నాశనం అయ్యింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ జీవిత కాల నిషేధానికి గురయ్యాడు. అనంతరం కోర్టుకు వెళ్లిన అతడికి అక్కడ ఊరట లభించడంతో మళ్లీ బంతి పట్టి దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. కేరళ తరఫున ఈ ఏడాది రంజీల్లో ఒక మ్యాచ్ ఆడాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. అయితే వయసు మీద పడటంతో శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.