• Home
 • »
 • News
 • »
 • sports
 • »
 • SA VS PAK NETIZENS TROLLED QUINTON DECOCK FOR HIS FAKE FIELDING WHICH LEADS FAKHAR ZAMAN RUN OUT ON 193 SRD

SA vs PAK : డికాక్.. ఇది ఒక గెలుపేనా..మరీ..ఇంత మోసం చేస్తావా..

Photo Credit : Twitter

SA vs PAK : ఇంకో ఏడు పరుగులు చేస్తే..పాకిస్థాన్ ఓపెనర్ (Fakhar Zaman) ఫకర్ జమాన్ ఖాతాలో మరో అద్భుత రికార్డు చేరేది. కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ అందుకున్న రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించేవారు. అయితే, సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ (Quinton Decock) చేసిన చీప్ ట్రిక్ తో రనౌటయ్యాడు పాక్ ఓపెనర్. అసలేం జరిగిదంటే..

 • Share this:
  సౌతాఫ్రికా - పాకిస్థాన్ (SA vs PAK) ల మధ్య మూడో వన్డేల సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. గెలుపు కోసం ఇరు జట్లు ఆఖరి వరకూ పోరాడుతున్నాయ్. మొదటి వన్డేలో పాక్ విక్టరీ కొట్టగా.. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. రెండో వన్డేలో 193 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ (Fakhar Zaman). అయితే, ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton Decock) చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రీడా స్ఫూర్తి మరచి ఫకర్ జమాన్ రనౌటయ్యేలా అతన్ని దృష్టిని మలిచాడు డికాక్. దీంతో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయ్ ఇరు జట్లు.
  వివారాల్లోకెళితే.. నిన్న జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. డికాక్‌ (80; 10 ఫోర్లు, సిక్స్‌), బవూ మా (92; 9 ఫోర్లు), డస్సెన్‌ (37 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిల్లర్‌ (27 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్లో పాక్‌ విజయానికి 30 పరుగులు అవసరం కాగా... తొలి బంతికే ఫకర్‌ ఔటవ్వడంతో పాక్‌ ఓటమి ఖాయమైంది.భారీ ఛేజింగ్ కు దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తడబడింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(31) మినహా.. ఇమామ్ ఉల్ హక్(5), మహ్మద్ రిజ్వాన్(0), డానిష్ అజిజ్(9), షాదా్ ఖాన్(13) దారుణంగా విఫలమవడంతో పాకిస్థాన్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

  ఈ లెక్కన పాక్ 200 పరుగుల లోపే ఆలౌటవుతుందని అంతా భావించారు. కానీ ఫకార్ జమాన్ ఒంటరి పోరాటం చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో వన్ మ్యాన్ షో చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ సహకారం అందకపోయినా ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకొని డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు.ఆఖరి ఓవర్ లో పాక్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. ఎంగిడి వేసిన బంతిని జమాన్ లాంగాఫ్ దిశగా ఆడాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో రనౌటయ్యాడు. ఇక్కడ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడు. ఫకర్ జమాన్‌ను ఫూల్ చేశాడు. జమాన్ రెండో పరుగు తీసే క్రమంలో బౌలర్ వైపు బంతిని వేయాలని ఫీల్డర్‌కు సూచిస్తూ గట్టిగా అరిచాడు. దీంతో జమాన్ వెనక్కి తిరగ్గా.. బంతిని అందుకున్న డికాక్ వికెట్లను కొట్టేశాడు.


  అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరూ డికాక్ స్మార్ట్‌గా ఆలోచించారంటే.. మరికొందరు అతడు చీప్ ట్రిక్ చేశాడని మండిపడుతున్నారు. ఇలా గెలవడం కూడా ఓ గెలుపేనా అని ఫ్యాన్స్ ను డికాక్ పై ఫైరవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ నిబంధనల్లోని 41.5 రూల్ ప్రకారం మైదానంలో ఫీల్డర్, బౌలర్, కీపర్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వారి చర్యల ద్వారా బ్యాట్స్‌మన్ దృష్టిని మరల్చడం, మోసగించడం, ఆటంకం కలిగించినట్లయితే.. అంపైర్లు అలా భావిస్తే.. ఇరు జట్ల కెప్టెన్లకు ఈ విషయాన్ని తెలియజేసి 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. అంటే బాధిత జట్టుకు 5 పరుగులు అదనంగా కలుపుతారు. ఇప్పుడు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నెటిజన్లు డికాక్ పై మండిపడుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: