SA VS IND T20 SERIES CRICKET SOUTH AFRICA HAS ANNOUNCED ITS SQUAD FOR THE 5 MATCH T20I SERIES AGAINST INDIA SJN
SA vs IND : భారత్ తో టి20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్..
సౌతాఫ్రికా (PC : IPL)
SA vs IND : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికాా (South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.
SA vs IND : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికాా (South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ ల ో పర్యటించనుంది. ఈ క్రమంలో జూన్ 9న ఆరంభమయ్యే ఈ సిరీస్ జూన్ 19వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా 17 మందితో టీంను ప్రకటించింది. ఈ జట్టుకు బవుమా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయంతో గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అన్రిచ్ నోకియా తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత వేన్ పార్నెల్ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వేన్ పార్నెల్ చివరిసారిగా 2017లో సౌతాఫ్రికా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు.
సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో దాదాపు సగం మంది ఐపీఎల్ లో ఆడుతున్న వారే ఉండటం విశేషం. దాంతో వీరు ఇప్పటికే భారత్ వాతావరణానికి అలవాటు పడ్డారు. ఇక భారత్ తన జట్టును ఈ నెల 29లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఇందు కోసం ఈ నెల 23 సెలక్షన్ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు మరికొందరు భారత స్టార్ ప్లేయర్స్ కు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది.
షెడ్యూల్ ఇదే
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న జరిగే మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12వ తేదీన రెండో టి20, మహారాష్ట్రలోని విదర్భలో 14వ తేదీన మూడో టి20 జరగనున్నాయి. ఇక చివరి రెండు టి20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు టి20లు కూడా జూన్ 17, 19వ తేదీల్లో జరుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.