Home /News /sports /

SA VS BAN ODI SERIES BANGLADESH SCRIPTS NEW HISTORY WITH THEIR FIRST BILATERAL ODI SERIES WIN IN SOUTH AFRICA SRD

SA vs BAN ODI Series : టీమిండియా వల్ల కానిది.. బంగ్లాదేశ్ చేసి చూపించింది.. సఫారీ గడ్డపై నయా చరిత్ర..

Taskin Ahmed

Taskin Ahmed

SA vs BAN ODI Series : సిరీస్ అసాంతం ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన బంగ్లా పులులు సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే కీల‌క‌మైన మూడో వ‌న్డే మ్యాచ్‌లోనూ చెల‌రేగారు. ఆ జ‌ట్టు బౌల‌ర్ టస్కిన్ అహ్మ‌ద్ విశ్వ‌రూపానికి తోడు ఓపెన‌ర్ల విజృంభ‌ణ క‌లిసి సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌కు తొలి వ‌న్డే సిరీస్ ల‌భించింది.

ఇంకా చదవండి ...
    దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ (Bangladesh) చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జ‌న‌వరిలో ఇదే సౌతాఫ్రికా గ‌డ్డ‌పై 3 వ‌న్డేల సిరీస్ ఆడిన టీమిండియా (Team India) ఒక్క మ్యాచ్‌లోనూ గెల‌వ‌లేక వైట్ వాష్ అయింది. మూడింటికి మూడు వ‌న్డేల్లోనూ ఓడి సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. టీమిండియా చేతులేత్తేసిన చోట బంగ్లాదేశ్ రెచ్చిపోయింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ (SA vs BAN ODI Series)ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సిరీస్ అసాంతం ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన బంగ్లా పులులు సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే కీల‌క‌మైన మూడో వ‌న్డే మ్యాచ్‌లోనూ చెల‌రేగారు. ఆ జ‌ట్టు బౌల‌ర్ టస్కిన్ అహ్మ‌ద్ విశ్వ‌రూపానికి తోడు ఓపెన‌ర్ల విజృంభ‌ణ క‌లిసి సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌కు తొలి వ‌న్డే సిరీస్ ల‌భించింది. అయితే, సౌతాఫ్రికా గ‌డ్డ‌పై ఫార్మాట్ ఏదైన బంగ్లాదేశ్‌కు ఇదే తొలి సిరీస్ విజ‌యం.

    మూడో వ‌న్డేలో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్ బౌల‌ర్ల ధాటికి 37 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లాదేశ్ పేస్ బౌల‌ర్ టస్కిన్ అహ్మద్ 5 వికెట్ల‌తో చెల‌రేగి సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టాడు. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సౌతాఫ్రికా ఓపెన‌ర్ జననేమన్ మలన్ 39 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగ‌తా వారిలో మ‌హారాజ్ 28, ప్రిటోరియస్ 20, మిల్ల‌ర్ 16, డికాక్ 12, వెర్రెయిన్నే 9, ర‌బాడ 4, డ‌స్సెన్ 4, షంసీ 3, బ‌వుమా 2 ప‌రుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో టస్కిన్ అహ్మ‌ద్ 5, ష‌కీబ్ 2, హాస‌న్, ఇస్లాం త‌లో వికెట్ తీశారు.


    ఆ తర్వాత 155 ప‌రుగుల స్వ‌ల్ప‌ ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ సునాయ‌సంగా చేధించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ త‌మీమ్ ఇక్బాల్ 87 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఓపెన‌ర్లు ఇక్బాల్, లిట‌న్ దాస్ తొలి వికెట్‌కు 127 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్మాన్ని నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో 48 ప‌రుగులు చేసిన లిట‌న్ దాస్ ఔటైన‌ప్ప‌టికీ ష‌కీబుల్ హాస‌న్ (18*)తో క‌లిసి త‌మీమ్ ఇక్బాల్ జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చాడు.


    కేవ‌లం 26.3 ఓవ‌ర్ల‌లోనే బంగ్లాదేశ్ విజ‌యాన్ని అందుకుంది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌తోపాటు వ‌న్డే సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. అయితే, తొలి వ‌న్డేలో బంగ్లాదేశ్ 38 ప‌రుగుల తేడాతో గెల‌వ‌గా.. రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఇది కూడా చదవండి : కింగా మజాకా..ఈ మూడు జట్ల కన్నా కోహ్లీనే తోపు.. ఏ విషయంలో అంటే..

    దీంతో 3 వ‌న్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ఆ జ‌ట్టు పేస‌ర్ టస్కిన్ అహ్మ‌ద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా ల‌భించింది.ఈ ఏడాది జ‌న‌వరిలో ఇదే సౌతాఫ్రికా గ‌డ్డ‌పై 3 వ‌న్డేల సిరీస్ ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ గెల‌వ‌లేక వైట్ వాష్ అయింది. మూడింటికి మూడు వ‌న్డేల్లోనూ ఓడి సిరీస్‌ను 0-3తో కోల్పోయింది.ఈ సిరీస్ కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Cricket, South Africa, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు