SA20 League 2023 : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ (SA20 League) తొలి సీజన్ తుది అంకానికి చేరుకుంది. గత నెలలో ఘనంగా ఆరంభం అయిన ఈ ధనాధన్ లీగ్.. సోమవారంతో లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ లీగ్ లో ఉన్న ఆరు జట్లను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోని ఫ్రాంచైజీలే సొంతం చేసుకోవడం విశేషం. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓనర్లు సౌతాఫ్రికా లీగ్ లోని ఆరు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నారు. వీటికి ఐపీఎల్ పేర్లే పెట్టారు.. కానీ, సౌతాఫ్రికా సిటీ పేర్లను ముందు తగిలించారు.
ముంబై ఇండియన్స్ కేప్ టౌన్.. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ప్రిటోరియా క్యాపిటల్స్, జొహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, పర్ల్ రాయల్స్ పేర్లతో టోర్నీలో బరిలోకి దిగారు. ఆరు జట్లతో జరిగిన ఈ లీగ్ లో గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు జట్లతో రెండేసి సార్లు.. అంటే ఒక్కో జట్టు 10 మ్యాచ్ లను ఆడింది. ముంబై, చెన్నై, ప్రిటోరియా, పర్ల్ రాయల్స్ మినహా మిగిలిన జట్లు 10 మ్యాచ్ లను ఆడేశాయి. ఈ మిగిలిన నాలుగు జట్లు సోమవారం తమ ఆఖరి మ్యాచ్ లను ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా నాలుగు జట్లు సెమీస్ చేరుకున్నాయి.
ప్రిటోరియా క్యాపిటల్స్, జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, పర్ల్ రాయల్స్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. డర్బన్ సూపర్ జెయింట్స్, ముంబై జట్లు 5, 6 స్థానాల్లో నిలిచి నాకౌట్ స్టేజ్ కు అర్హత సాధించలేదు. ఇక సెమీఫైనల్ మ్యాచ్ లు ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో జరుగుతాయి. అయితే ఐపీఎల్ మాదిరి కాకుండా.. ఐసీసీ టోర్నీల్లో నిర్వహించే సెమీస్ ఫార్మాట్ లో నాకౌట్ మ్యాచ్ లు జరుగుతాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ ఈ నెల 11వ తేదీన జరగనుంది. తొలి సెమీఫైనల్లో టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టుతో నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. రెండో సెమీస్ లో టేబుల్ లో 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ లను చూడాలంటే స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమాలో ప్రత్యక్షంగా చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Delhi Capitals, Lucknow Super Giants, Mumbai Indians, Rajasthan Royals, South Africa, Sunrisers Hyderabad