సచిన్ 40 ఏళ్లకు రిటైర్ అయ్యాడు...ధోనీ 38కే అవ్వాలా...శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు...

సచిన్ , ద్రవిడ్ 40 సంవత్సరాలు ఆడినప్పుడు ధోని కూడా ఆడవచ్చు. ధోని 42 సంవత్సరాలు ఆడగలడని నా అభిప్రాయం.

news18-telugu
Updated: May 29, 2020, 8:06 AM IST
సచిన్ 40 ఏళ్లకు రిటైర్ అయ్యాడు...ధోనీ 38కే అవ్వాలా...శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు...
శ్రీశాంత్
  • Share this:
ధోని (MS Dhoni) టీమ్ ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తాడు? ధోని కెరీర్ ముగిసిందా? ధోని తిరిగి రావడానికి ఐపిఎల్ లో పెర్ఫార్మెన్స్ అవసరమా? ఇవి ప్రతి భారతీయ అభిమాని మనస్సులో ఉన్న ప్రశ్నలు. టీమిండియాలో ధోనీ రిటర్న్స్ ఎప్పుడని క్రికెట్ అభిమానుల ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిలో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కూడా ఒకరు. అతడు మరో అడుగు ముందుకేసి ధోని ఇంకా ఫిట్ గా ఉన్నాడని, వచ్చే 3-4 సంవత్సరాలు క్రికెట్ ఆడగలనని శ్రీశాంత్ తెలిపారు.

సచిన్ 40 వరకు ఆడాడు, ధోని ఎందుకు ఆడలేడు?

హలో యాప్‌తో సంభాషణలో శ్రీశాంత్ (S Sreesanth) ధోనిపై పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు, "ధోనికి ఇంకా ఫిట్‌నెస్  ఉందని. ధోని గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడని,  ప్రస్తుతం రిషబ్ పంత్, సంజు సామ్సన్ అయితే ధోని తో సమానం కాదు అని శ్రీశాంత్ అన్నారు. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా మంచి వికెట్ కీపర్ కానీ ధోని  అంతటి వాడు కాదని అన్నారు. అలాగే  శ్రీశాంత్ ఇంకా మాట్లాడుతూ, "ధోని డాన్ అని అతనిని పట్టుకోవడం అసాధ్యమని ఆకాశానికెత్తేశాడు.

ధోని బౌలర్ పేరు చెప్పి సిక్సర్లు కొట్టేవాడు...
పాకిస్థాన్‌ తో మ్యాచ్ అంటే ఎంఎస్ ధోని సిక్సర్లు కొట్టేవాడు అని శ్రీశాంత్ (S Sreesanth) అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ముందు ధోని తనను అడిగేవాడని... ఈ రోజు ఏ బౌలర్ సిక్సర్ కొట్టాలో చెప్పమనేవాడని అన్నాడు.. మహమ్మద్ ఆసిఫ్ పై బాదాలని తాను చెప్పినట్లు గుర్తచేశాడు. మాట ఇఛ్చినట్లుగానే ధోని చాలా లాంగ్ సిక్సర్ కొట్టాడు. ధోని మాటిచ్చి సిక్సర్లు కొట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఉమేష్ యాదవ్ ధోని సిక్సర్లను ఎప్పటికీ మరచిపోలేమని అన్నాడు.

తిరిగి రావడానికి ధోనికి మ్యాచ్ అవసరం లేదు
తిరిగి రావడానికి ధోనికి ఎలాంటి మ్యాచ్ అవసరం లేదని శ్రీశాంత్ (S Sreesanth) అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ, "ధోనికి తిరిగి రావడానికి ఐపిఎల్ అవసరం లేదు. అతను బ్లూ జెర్సీ ధరించిన రోజు, అతను సిద్ధంగా ఉంటాడు. అతను సైన్యంలో ఉన్నాడు. అతను ఆర్మీ దుస్తులు ధరించిన రోజు, అతను ఒక ప్రొఫెషనల్ సైనికుడు అవుతాడు. అదే విధంగా, ధోని టీమ్ ఇండియా బ్లూ జెర్సీని ధరించి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, అతనికి ప్రాక్టీస్ అవసరం లేదని ప్రశంసించాడు. ధోనీ వయస్సు 38 సంవత్సరాలు అని ఆరోగ్యంగా ఉన్నాడు. సచిన్, ద్రవిడ్ 40 సంవత్సరాలు ఆడినప్పుడు ధోని కూడా ఆడవచ్చు. ధోని 42 సంవత్సరాలు ఆడగలడని నా అభిప్రాయమని శ్రీశాంత్ అన్నాడు.ఇక అనేక మంది బౌలర్లను భయపెట్టిన ఎబి డివిలియర్స్ తన బౌలింగ్ లో చాలా సార్లు అవుటయ్యాడని శ్రీశాంత్ అన్నాడు. తాను డివిలియర్స్ ను చాలాసార్లు ఔట్ చేశానని గుర్తు చేశాడు. టెస్టుల్లో 6-7 సార్లు తన వికెట్ తీసుకున్నట్లు గుర్తుచేశాడు. ప్రపంచ కప్‌లో, డివిలియర్స్ తన బంతిపై రెండుసార్లు అవుట్ అయ్యాడని. అంపైర్ అతనికి మొదటి బంతికి ఎల్‌బిడబ్ల్యు ఇవ్వలేదు కాని అతను తదుపరి బంతిపై మళ్లీ ఎల్‌బిడబ్ల్యు అయ్యాడని గుర్తు చేశాడు.
First published: May 29, 2020, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading