హోమ్ /వార్తలు /క్రీడలు /

Vijay Hazare Trophy: ఐపీఎల్ స్టార్ నాలుగు రోజుల్లో మూడు సెంచరీలు.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు లైన్ క్లియర్? ఆ సీనియర్ మాత్రం విఫలం

Vijay Hazare Trophy: ఐపీఎల్ స్టార్ నాలుగు రోజుల్లో మూడు సెంచరీలు.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు లైన్ క్లియర్? ఆ సీనియర్ మాత్రం విఫలం

విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు బాదిన రుతురాజ్

విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు బాదిన రుతురాజ్

Vijay Hazare Trophy: బీసీసీఐ నిర్వహించే లిస్ట్-ఏ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడుతున్నాడు. నాలుగు రోజుల్లో మూడు సెంచరీలు బాది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

టీమ్ ఇండియా (Team India) త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) వెళ్లనున్నది. ఇప్పటికే కోహ్లీ (Kohli) కెప్టెన్సీలోని టెస్టు జట్టును జాతీయ సీనియర్ సెలెక్టర్లు (National Senior Selectors) ప్రకటించారు. అయితే వన్డే జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించినా.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు జట్టును మాత్రం ప్రకటించలేదు. టీమ్ ఇండియా చివరి సారిగా శ్రీలంక జట్టుతో వన్డే సిరీస్ ఆడింది. అయితే అప్పుడు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో లేకపోవడంతో ద్రవిడ్ తాత్కాలిక కోచ్‌గా ధావన్ కెప్టెన్‌గా వేరే టీమ్‌ను లంకకు పంపించింది. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం పూర్తి స్థాయి టీమ్‌ను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుకే విజయ్ హజారే ట్రోఫీలో ప్రదర్శనను కూడా చూసి టీమ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నది. టీమ్ ఇండియా తొలి టెస్టు డిసెంబర్ 26న ఆడనున్నది. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ కూడా అదే రోజు జరుగనున్నది. టెస్టు సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. దేశవాళీలో సత్తా చాటిన వాళ్లకు తప్పకుండా జాతీయ జట్టులో స్థానం కల్పిస్తామని ద్రవిడ్ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో కొంత మంది తలరాతలు మారే అవకాశం ఉన్నది.

మహారాష్ట్ర జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు రోజుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇవాళ కేరళతో జరిగిన మ్యాచ్‌లో 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్ గత ఐపీఎల్‌లో కూడా అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. దీంతో అతడు తప్పకుండా సఫారీ సిరీస్‌కు ఎంపిక అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదట మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 112 బంతుల్లో 136 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులు చేసి జట్టును గెలిపించడమే కాకుండా నాటౌట్‌గా నిలిచాడు. 143 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సులతో రుతురాజ్ 154 పరుగులు చేశాడు.

Anushka Sharma-Virat Kohli Anniversary: కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమాయణంలో గొడవలు.. ఒక స్టేజ్ లో బ్రేకప్ దాకా వెళ్లి..


తాజాగా శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళపై 129 బంతుల్లో 124 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రుతురాజ్ సెంచరీలో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. లిస్ట్ ఏ కెరీర్‌లో రుతురాజ్ మొత్తం 60 ఇన్నింగ్స్‌లో 52 సగటుతో 2971 పరుగులు చేశాడు. లిస్ట్ ఏలో అతడి అత్యధిక స్కోర్ 187. మరోవైపు శ్రీలంక పర్యటనలో కూడా రాహుల్ ద్రవిడ్ దృష్టిని ఆకర్షించాడు.

PKL 8: సొంత గడ్డపై బెంగళూరు బుల్స్ టైటిల్ సాధించేనా? బెంగళూరు జట్టు బలాలు, బలహీనతలు ఏమిటి?ఇక టీమ్ ఇండియా వన్డే ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. శనివారం యూపీతో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కాగా.. హైదరాబాద్‌పై కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ధావన్ పేలవ రికార్డు కొనసాగుతూనే ఉన్నది. ఇది కచ్చితంగా దక్షిణాఫ్రికా సిరీస్‌పై ప్రభావం చూపుతుంది. ధావన్ స్థానంలో రుతురాజ్‌ను ఓపెనర్‌గా తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bcci, Chennai Super Kings, Cricket

ఉత్తమ కథలు