RUSSIAN WOMAN TENNIS PLAYER ALLEGEDLY FIXED DOUBLES MATCH FRENCH POLICE DETAINED YANA SIZIKOVA JNK
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫిక్సింగ్ కలకలం.. మహిళా ప్లేయర్ అరెస్టు.. ఫ్రాన్స్ వదిలి వెళ్లకుండా కట్టడి
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫిక్సింగ్ కలకలం..
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఇప్పుడు టెన్నిస్కి కూడా పాకింది. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఎప్పుడూ వినని మ్యాచ్ ఫిక్సింగ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో వెలుగు చేసింది. రష్యాకు చెందిన క్రీడాకారిణి ఒక మహిళల డబుల్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు.
క్రికెట్‌ను పట్టి పీడిస్తున్న ఫిక్సింగ్ భూతం ఇప్పుడు టెన్నిస్‌కు కూడా పాకింది. వ్యక్తిగత క్రీడగా పేరు ఉన్న టెన్నిస్‌లో (Tennis) ఒక క్రీడాకారిణి మ్యాచ్ ఫిక్సింగ్‌కు (Match Fixing) పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇది వెలుగు చూడటం ఆశ్చర్యంగా మారింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ (French Open) సమయంలో రొమేనియాకు చెందిన ఆండ్రియా మితు, పాట్రిషియా మారికి రష్యాకు చెందిన యానా సిజికోవా (Yana Sizikova), అమెరికాకు చెందిన మాడిసన్ బ్రింగెల్ మధ్య మహిళల డబుల్స్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌ను రష్యాకు చెందిన యానా సిజికోవా ఫిక్సింగ్ చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ITIA) దర్యాప్తు ప్రారంభించింది. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేష్తో (FFT) కలసి చేసిన దర్యాప్తులో యానా సిజికోవాకు ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన సిజికోవాను అదుపులోనికి తీసుకొని విచారించడం వీలు పడలేదు. అప్పటికి విచారణను నిలిపివేసిన ఐటీఐఏ బృందం గత ఏడాది సెప్టెంబర్ నుంచి వేచి చూస్తున్నది. అప్పటికే ఆర్గనైజ్డ్ క్రైమ్, అవినీతి ఆరోపణల కేసులు సిజికోవాపై నమోదు చేశారు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఆడటానికి ప్యారీస్ వచ్చిన ఆమెను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు.
గత ఏడాది నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు బృందం యానా సిజికోవా ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఆడటం కోసం రాగానే రోలాండ్ గారోస్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. ఆమెను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపైనే అదుపులోనికి తీసుకున్నట్లు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ విషయాన్ని రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్‌కు కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన వివరాలను రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు షామిల్ తర్పిశ్చేవ్కు పంపించినట్లు సమాచారం. పారిస్‌లోని రష్యన్ ఎంబసీ అధికారులకు కూడా సిఝికోవాను డిటెన్షన్ చేసినట్లు వివరాలు పంపించారు. అయితే సిజికోవా తప్పు చేసిందా లేదా అనేది ఫ్రెంచ్ పోలీసులు పంపిన డాక్యుమెంట్లలో స్పష్టంగా లేదని షామిల్ తర్పిశ్చేవ్ అంటున్నారు. ఈ కేసులో ఎక్కడో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని.. యానా తప్పు చేసి ఉంటే తిరిగి ఫ్రాన్స్ ఎందుకు వెళ్తుందని రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారులు అంటున్నారు. కాగా, ప్రస్తుతానికైనే సిజికోవాను విడుదల చేసిన పోలీసులు ఆమెను ఫ్రాన్స్ వదలి ఇప్పుడే వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు.
రష్యాకు చెందిన యానా దిమిత్రియేవన సిజికోవ 1994 నవంబర్ 12న మాస్కోలో జన్మించింది. మహిళల సింగిల్స్, డబుల్స్‌లో పలు గ్రాండ్‌స్లామ్స్ ఆడింది. 2020, 2021క ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళళ డబుల్స్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌లో స్విస్ ఓపెన్ 2019 టైటిల్ మాత్రమే ఆమె ఖాతాలో ఉన్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.