ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్...డోపింగ్‌ వివాదంతో ఆందోళనలో ఆటగాళ్లు...

ప్రపంచ క్రీడా రంగంలో ఒక భారీ కుదుపు అనే చెప్పవచ్చు. దీంతో జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌ నుంచి రష్యాను బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఇతర అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి కూడా రష్యాను బ్యాన్ చేస్తున్నట్లు వాడా తెలిపింది.

news18-telugu
Updated: December 9, 2019, 7:42 PM IST
ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్...డోపింగ్‌ వివాదంతో ఆందోళనలో ఆటగాళ్లు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రష్యా దేశం ఒలింపిక్స్ కలలపై ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నీళ్లు చల్లింది. డోపింగ్‌ టెస్టులకు సంబంధించి ఆ దేశం తప్పుడు సమాచారం ఇచ్చిందని రష్యా ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ, వాడా ప్రకటించింది. దీంతో ప్రపంచ క్రీడా రంగంలో ఒక భారీ కుదుపు అనే చెప్పవచ్చు. దీంతో జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌ నుంచి రష్యాను బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఇతర అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి కూడా రష్యాను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.  స్విట్జర్లాండ్‌లో జరిగిన వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు రష్యా జట్టుపై నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నామని వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక ఈ నిషేధంపై అప్పీలు చేసుకోవడానికి రష్యాకు వాడా 21 రోజులపాటు గడువునిచ్చింది. అయితే తాము నిషేధంపై అప్పీలుకు వెళ్తామని రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ పేర్కొంది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>