India new jersey: టీమిండియా న్యూ జెర్సీ.. ఎలా ఉందో చూశారా!

Team: INDIA Rank: 2 Points:5819 Mathes:49 Ratings:119

టీమిండియా..ఆస్ట్రేలియా సిరీస్‌లో కొత్త లుక్‌లో మెరిసిపోనుంది. ఈ సిరీస్ భారత్ జట్టు కొత్త జెర్సీని ధరించబోతోంది.

  • Share this:


    టీమిండియా..ఆస్ట్రేలియా సిరీస్‌లో కొత్త లుక్‌లో మెరిసిపోనుంది. ఈ సిరీస్ భారత్ జట్టు కొత్త జెర్సీని ధరించబోతోంది. తాజాగా ఈ జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆవిష్కరించింది. లుక్ మాత్రం గతంలో టీమిండియా ధరించిన జెర్సీ మాదిరిగానే కనిపిస్తోంది. ముదురు నీలం రంగులో ఉన్న జెర్సీలో తెలుపు,ఎరుపు,ఆకుపచ్చ కలర్స్‌కు అడ్ చేశాడు. దానిపై ఎంపీఎల్ స్పోర్ట్స్‌ పేరును కూడా ముద్రించారు.





    ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థతో గత నెలలో బీసీసీఐ ఈ మేరకు ఒప్పందాన్ని విషయం తేలిసిందే. బీసీసీఐ-ఎంపీఎల్ స్పోర్ట్స్ మధ్య కుదిరిన ఈ అగ్రిమెంట్‌లో రూ 120 కోట్లను ఆదాయాన్ని షేరు చేసుకోవడంతో పాటు ఇతర ఆదాయాలను పంచుకోవాలని నిర్ణయించాయి. ఎంపీఎల్ భారత జట్టుకు కొత్త కిట్లను స్పాన్సర్ చేస్తోంది . ఆటగాళ్ళకు కొత్త జెర్సీ, కొత్త కిట్లను సమకూర్చనుంది. ఇంతకు ముందు క్రికెటర్స్‌కు నైక్ సంస్థ స్పాన్సర్‌గా ఉండేది. తాజాగా ఆ సంస్థ వైదొలగడంతో ఎంపీఎల్ స్పోర్ట్స్ఆ స్థానంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా సీరిస్‌లో టీమిండియా ఆ సంస్థ లోగోతో కూడిన కొత్త జెర్సీని ధరించబోనుంది.

    కాగా, ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది టీమిండియా. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేకాదు ఆస్ట్రేలియాతో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది టీమిండియా. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19)లో తదుపరి మ్యాచ్‌లు జరుగుతాయి.

    వన్డే మ్యాచ్‌లు

    మెుదటి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ),
    రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ),
    మూడో వన్డే: డిసెంబర్ 2: (క్యాన్‌బెర్రా )

    టీ20 మ్యాచ్‌లు

    తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్‌బెర్రా),
    రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ),
    మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ),
    Published by:Rekulapally Saichand
    First published: