RS 1 CRORE FOR THOMAS CUP WINNING INDIA BADMINTON TEAM AND AP CM YS JAGAN MOHAN REDDY PRAISES KIDAMBI SRIKANTH SRD
Thomas Cup : విదేశీ గడ్డపై తొడగొట్టిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారీ నజరానా.. సీఎం జగన్ ప్రశంసలు..
థామస్ కప్ ను నెగ్గిన భారత పురుషుల జట్టు
Thomas Cup : థామస్ కప్ లో భారత (India) బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది.
థామస్ కప్ లో భారత (India) బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది. బ్యాంకాక్ (bangkok) వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు జయకేతం ఎగరవేసింది. పురుషుల టీం విభాగంలో జరిగే థామస్ కప్ (Thomas Cup) లో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, హెచ్ ఎస్ ప్రణయ్, ధ్రువ్ కపిల, అర్జున్ లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో భారత జట్టు 3-0తో డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాపై ఘనవిజయం సాధించి తొలిసారి థామస్ కప్ ను సొంతం చేసుకుంది.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదో గొప్ప రోజనే చెప్పాలి. ఇప్పటి వరకు థామస్ కప్ లో విజేతగా నిలువని భారత జట్టు ఆదివారం అద్భుతం చేసి చూపించింది. బెస్ట్ ఆఫ్ ఫైఫ్ మ్యాచెస్ పద్ధతిన జరిగిన ఫైనల్లో.. 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను భారత్ వరుస మ్యాచ్ ల్లో మట్టికరిపించింది. తొలుత జరిగిన సింగిల్స్ లో బరిలోకి దిగిన లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనిపై పోరాడి గెలిచాడు. తొలి గేమ్ లో ఓడిపోయిన లక్ష్యసేన్.. ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లోనూ నెగ్గి మ్యాచ్ నెగ్గాడు.
ఫలితంగా భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం జరిగిన డబుల్స్ లో బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట 18-21, 23-21, 21-19తో మొహమ్మద్-కెవిన్ సంజయ ద్వయంపై గెలిచింది. దాంతో భారత జట్టు ఆధిక్యం 2-0కు చేరుకుంది.ఇక మూడో మ్యాచ్ లో బరిలోకి దిగిన కిడాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాథన్ క్రిస్టీ పై వరుస గేముల్లో నెగ్గి భారత్ కు థామస్ కప్ ను అందించాడు. మహిళల విభాగంలో జరిగే ఉబెర్ కప్ లో భారత మహిళల జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరలేకపోయింది.
A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup!
Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot.
అయితే పురుషుల జట్టు మాత్రం అద్భుత ఆటతీరుతో చాంపియన్ గా నిలిచింది. ఇక థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.ఇక, థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.