ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన టోక్యో ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది.ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ రేపు ప్రారంభం కానున్నాయ్. తొలిరోజు ఆరంభోత్సం... జపాన్ కళలతో, కళాకారులతో అలరించేందుకు ముస్తాబైంది.ఇప్పటికే టోక్యోలో అడుగుపెట్టిన టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పతకాల వేటతో భారత జెండాను రెపరెపలాడించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే, టీమిండియా ఫ్యాన్స్..ప్రముఖులు భారత అథ్లెట్లకు ప్రత్యేక విషెస్ తెలిపారు.ఇక, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత క్రీడా బృందానికి "RRR" చిత్ర బృందం స్పెషల్ విషెస్ తెలియజేసింది. క్రీడాకారుల కోసం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది.గన్ పట్టుకున్న రామ్ చరణ్, బళ్లెం పట్టుకున్న ఈ పోస్టర్ లో కన్పిస్తున్నారు. వారి వెనుక ఒలింపిక్స్ చిహ్నం కూడా ఉంది.ఒలింపిక్స్ అథ్లెట్లను ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ఉంది. షూటింగ్, ఆర్చరీ, రన్నింగ్ వంటి క్రీడలను పోలే విధంగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ, క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
" భారత క్రీడాకారులకు మద్దతుగా దేశంతో మేం కూడా కలిశాం. ఎంతో టాలెంట్ ఉన్న మన భారత ఆటగాళ్లు ఆల్ ది బెస్ట్. మేం మీతో ఉన్నాం " అంటూ ఈ పోస్టర్ కి క్యాప్షన్ ఇచ్చింది. ఇక, ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా... మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ‘రియో’ క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు.
We are joining the nation in cheering for the Indian contingent for Tokyo Olympics ?? Let's root for the talented athletes representing our country ?? We are with you, @IndianOlympians ! ✊? #Tokyo2020 #Cheer4India @afiindia @WeAreTeamIndia #RRRMovie pic.twitter.com/I0AQSEdZD6
— RRR Movie (@RRRMovie) July 22, 2021
ఇక, టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి అత్యధికంగా 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పతకాల వేటకు వెళ్లనున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని మన క్రీడాకారులు నిలబెట్టుకుని మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తారని ఆశిద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.