Home /News /sports /

IPL 2021 : RR Vs SRH టాస్ గెచ్చి బౌలింగ్ ఎంచుకున్న కేన్ మామ.. జట్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

IPL 2021 : RR Vs SRH టాస్ గెచ్చి బౌలింగ్ ఎంచుకున్న కేన్ మామ.. జట్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ [PC: iplt20.com]

టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ [PC: iplt20.com]

    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో రెండు జట్లు వరుస ఓటములు కొని తెచ్చుకున్నాయి. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నది.

    రాజస్థాన్ రాయల్స్ వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్నది. జాస్ బట్లర్, సంజూ శాంసన్ వంటి దూకుడైన బ్యాట్స్‌మెన్ ఉన్నా సరైన స్కోర్ బోర్డుపై పెట్టలేక పోతున్నది. ప్రారంభం ధాటిగా ఉన్నా మిడిల్ ఓవర్లలో పేలవ బ్యాటింగ్ రాజస్థాన్‌ను ఇబ్బంది పెడుతున్నది. మిడిల్, లోయర్ మిడిల్‌లో బ్యాట్స్‌మెన్ సరిగా రాణించలేకపోతున్నారు. మరోవైపు రాజస్థాన్ బౌలింగ్ కూడా బలహీనంగా కనపడుతున్నది. జోఫ్రా ఆర్చర్ వంటి పేసర్‌తో పాటు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగలిగే బెన్‌స్టోక్స్ లేకపోవడం పెద్దలోటు. ఉనద్కత్ వికెట్లు తీస్తున్నా.. అతడిని ఈ రోజు జట్టు నుంచి తప్పించారు.  అతడి స్థానంలో త్యాగీని తీసుకున్నారు. శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించి అనుజ్ రావత్‌ను జట్టులోకి తీసుకున్నారు.  మరి ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

    మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు ఉన్నది. వరుస పరాజయాలకు కెప్టెన్ డేవిడ్ వార్నరే కారణమని యాజమాన్యం ఇప్పటికే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. కేన్ విలియమ్‌సన్ గతంలో కూడా సన్‌రైజర్స్ టీమ్‌కు నాయక్వం వహించాడు. అయితే ఈ సారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. టాప్ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్‌‌సన్ రాణిస్తున్నారు. మనీష్ పాండే పరుగులు చేస్తున్నా.. మరింత వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉన్నది. జట్టులోకి భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబి తిరిగి వచ్చారు. డేవిడ్ వార్నర్, సుచిత్, సిద్దార్థ్ కౌల్ లను జట్టు నుంచి తప్పించారు.

    తుది జట్టు సభ్యులు వీరే

    Rajasthan Royals XI: J Buttler, Y Jaiswal, S Samson, A Rawat, D Miller, R Parag, R Tewatia, C Morris, K Tyagi, C Sakariya, M Rahman

    Sunrisers Hyderabad XI: A Samad, J Bairstow, K Williamson, M Pandey, V Shankar, M Nabi, K Jadhav, R Khan, S Sharma, B Kumar, K Ahmed
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket, IPL 2021, Kane Williamson, Rajasthan Royals, Sanju Samson, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు