RR vs DC: పంత్ సూపర్ షో... భారీ లక్ష్యచేధనలో ఢిల్లీ ఘన విజయం...

మరోసారి చెలరేగిపోయిన రిషబ్ పంత్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, 42 పరుగులు చేసిన పృథ్వీషా... పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్....

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 9:04 AM IST
RR vs DC: పంత్ సూపర్ షో... భారీ లక్ష్యచేధనలో ఢిల్లీ ఘన విజయం...
మరోసారి చెలరేగిపోయిన రిషబ్ పంత్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, 42 పరుగులు చేసిన పృథ్వీషా... పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్....
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 9:04 AM IST
IPL 2019 Live Score, RR vs DC at Jaipur: 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంతో తేలిగ్గా చేధించింది యంగ్ టీమ్ ఢిల్లి క్యాపిటల్స్. రిషబ్ పంత్, శిఖర్ ధావన్, పృథ్వీషా... ఈ యంగ్ గన్స్ సత్తా చాటుతూ ఢిల్లీ అద్భుత విజయం అందించారు. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించడంతో 7.3 ఓవర్లలోనే 72 పరుగులు సాధించింది ఢిల్లీ. అయితే ఈ దశలో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు.అయితే రిషబ్ పంత్‌తో జతకలిసిన పృథ్వీషా... ఇన్నింగ్స్ చక్కగా నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 39 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేసిన పృథ్వీషా.. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రూథర్డ్ పర్డ్ కూడా 11 పరుగులకే అవుట్ కావడంతో ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా... ఎక్కడ దూకుడు తగ్గించకుండా బ్యాటింగ్ చేసిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్..ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. పంత్ సూపర్ షో కారణంగా 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ కావడంతో 5 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆ తర్వాత అజింకా రెహానే, స్టీవ్ స్మిత్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్‌‌కు ఈ ఇద్దరూ 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత స్మీత్ అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న స్టీమ్ స్మిత్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ 8 పరుగులు, టర్నర్ డకౌట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భుత సెంచరీ నమోదుచేశాడు అజింకా రెహానే. కెప్టెన్సీ ఉన్ననాళ్లు ఒత్తిడి కారణంగా బాగా ఆడలేకపోయిన రెహానే... ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అజింకా రెహానేకు ఇది ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ కావడం విశేషం.



105 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అజింకా రెహానే రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యధిక స్కోరు నమోదుచేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు షేన్ వాట్సన్ 2015 సీజన్‌లో చేసిన 104 పరుగులే రాయల్స్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ తర్వాత 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన స్టువర్ట్ బిన్నీ, రబాడా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓ ఫోర్ కొట్టిన రియాన్ పరాగ్ చివరి బంతికి అవుట్ కావడంతో 191 పరుగులకు పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్. రబాడాకు రెండు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్‌లకు తలా ఓ వికెట్ దక్కాయి.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...