Home /News /sports /

IPL 2021 : సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ ఇవ్వడం వారికి ఇష్టం లేదు.. బాంబు పేల్చిన వీరేంద్ర సెహ్వాగ్

IPL 2021 : సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ ఇవ్వడం వారికి ఇష్టం లేదు.. బాంబు పేల్చిన వీరేంద్ర సెహ్వాగ్

సంజూ కెప్టెన్సీని వ్యతిరేకిస్తున్నది ఎవరు ?

సంజూ కెప్టెన్సీని వ్యతిరేకిస్తున్నది ఎవరు ?

  ఐపీఎల్ 2021లో (IPL 2021) ఓటములతో ప్రారంభంచి.. ఇప్పుడే గెలుపు బాటిన పట్టిన జట్టు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals). ఐపీఎల్ తొలి సీజన్ చాంపియన్ అవడం మినహా ఈ జట్టుకు ఇప్పటి వరకు సరైన రికార్డు లేదు. గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఈ ఏడాది కూడా శుభారంభం చేయలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్సీ, జట్టు నుంచి తప్పించి యువ క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) జట్టు బాధ్యతలు అప్పగించారు. జట్టులో జాస్ బట్లర్ వంటి అంతర్జాతీయ, అనుభవం ఉన్న ఆటగాడు ఉన్నా.. యాజమాన్యం మాత్రం సంజూ వైపే మొగ్గు చూపింది. తొలి మ్యాచ్‌లో తన బ్యాటుతో ఆకట్టుకున్నా.. జట్టుకు మాత్రం విజయం సాధించి పెట్టలేక పోయాడు. అయితే శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి మ్యాచ్ గెలిచింది. బౌలర్లు ముందుగా కోల్‌కతా బ్యాట్స్‌మాన్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం హడావిడి లేకుండా నింపాదిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి తప్పులు చేయకుండా ఆడిన మ్యాచ్ ఇదే.

  అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ఒక క్రీడా వెబ్‌సైట్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఉండటం కొంత మంది రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు ఇష్టం లేనట్లుగా ఉన్నదని అభిప్రాయపడ్డాడు. జట్టుతో ఎక్కువగా కలవని.. ఏకాంతంగా ఉండే వ్యక్తిని కెప్టెన్‌గా చేయడం వల్ల ఆటగాళ్లు సంతోషంగా లేనట్లు కనపడుతున్నదని అన్నాడు. అయితే ఎలాంటి వ్యక్తికైనా కొత్త బాధ్యతలు అప్పగిస్తే వాటిని పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి కాస్త సమయం పడుతుందన్న విషయం రాజస్థాన్ ఆటగాళ్లు గుర్తించాలని అన్నాడు. సంజూ శాంసన్ కూడా ఎవరైనా బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకు ఔటైనా వారి దగ్గరకు వెళ్లి భుజం తట్టి మాట్లాడాలని సూచించాడు. ఇదే సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ తన జట్టులోని క్రికెటర్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. సంజూ శాంసన్ కూడా అలా చేయడానికి కాస్త సమయం పడుతుందని అన్నాడు.

  ఇక శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సంజూ కెప్టెన్సీపై విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో పిచ్ పరిస్థితిని అర్దం చేసుకొని వరుసగా ఒకే బౌలర్‌తో బంతులు వేయించకుండా ఆరు ఓవర్లు వరకు వేర్వేరు బౌలర్లలో బౌలింగ్ చేయించాడు. దీంతో కేకేఆర్ జట్టు పవర్ ప్లే‌లో కేవలం 24 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా త్వరత్వరగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. లక్ష్య ఛేదన సమయంలో కూడా తొందర పడకుండా నిలకడగా ఆడుతూ సంజూ శాంసన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Cricket, IPL 2021, Rajasthan Royals, Sanju Samson, Virender Sehwag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు