• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RR PACER CHETAN SAKARIYAS FATHER PASSES AWAY AFTER CORONAVIRUS INFECTED SA

చేతన్‌ సకారియా ఇంట విషాదం.. అప్పుడు తమ్ముడు.. ఇప్పడు తండ్రి

చేతన్‌ సకారియా ఇంట  విషాదం.. అప్పుడు తమ్ముడు.. ఇప్పడు తండ్రి

Chetan Sakariya

సకారియా తండ్రి కన్‌జిభాయ్‌ సకారియా కరోనా కారణంగా మృతి చెందారు. ఇటీవలే కరోనా బారిన పడిన కన్‌జిభాయ్‌ సకారియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

  • Share this:


    పేస్‌ బౌలర్‌ చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. సకారియా తండ్రి కన్‌జిభాయ్‌ సకారియా కరోనా కారణంగా మృతి చెందారు. ఇటీవలే కరోనా బారిన పడిన కన్‌జిభాయ్‌ సకారియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సకారియా మృతి చెందినట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ఆదివారం ట్విటర్ ద్వారా వెల్లడించింది.

    "సకారియా ఇంట్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకోవడం చాలా బాధిస్తోంది. కోవిడ్‌-19తో పోరాడి కన్‌జిభాయ్‌ చివరకు ఓడిపోయారు. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ సమయంలో చేతన్‌ సకారియాకు అండగా నిలవాల్సి ఉంది. చేయూతను సకారియా కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. చేతన్‌ సకారియాతో మాట్లాడుతున్నాం. ఇది అతనికి కష్టకాలం" అంటూ రాజస్థాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 2020లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున చేతన్‌ సకారియా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

    ఈ ఏడాది ఆరంభంలో చేతన్‌ సకారియా సోదరుడు కూడా మృతి చెందాడు. ఈ రోజు తండ్రి మరణంచడంతో సకారియా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తమ్ముడు రాహుల్‌ జనవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఈ వార్తను తల్లిదండ్రులు సకారియాకు చెప్పలేదు. తమ్ముడంటే సకారియాకు అమితమైన ప్రేమ.
    Published by:Rekulapally Saichand
    First published: