• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RR IN DEEP TROUBLE TEAM MANAGEMENT WANTS SHREYAS GOPAL TO RETURN IN PLAYING XI JNK

IPL 2021 : కష్టాల్లో రాజస్థాన్.. తుది జట్టులోకి ఆ ఆటగాడు.. ఈ రోజైనా ఫేట్ మారేనా?

IPL 2021 : కష్టాల్లో రాజస్థాన్.. తుది జట్టులోకి ఆ ఆటగాడు.. ఈ రోజైనా ఫేట్ మారేనా?

రాజస్థాన్ కష్టాలు తీరేనా? ఆర్సీబీపై వ్యూహం ఏమిటి?

  • Share this:
    ఐపీఎల్(IPL 2021) తొలి సీజన్ విజేత అనే పేరు తప్పా గత 13 సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) గొప్పగా సాధించింది ఏమీ లేదు. మధ్యలో రెండేళ్ల పాటు నిషేధానికి గురై మరింత అప్రతిష్టపాలైన రాజస్థాన్ జట్టు.. కనీసం ఆటతీరు మెరుగు పరుచుకోవడంలో కూడా విఫలమవుతున్నది. ఐపీఎల్ 2020 సీజన్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్.. ఈ సారి కూడా సరైన శుభారంభాన్ని చేయలేదు. ఆడిన మూడింటిలో ఒకే మ్యాచ్ గెలిచి 7వ స్థానంలో ఉన్నారు. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌ను జట్టు నుంచి సాగనంపి.. యువకుడైన సంజూ శాంసన్‌కు పగ్గాలు అప్పగించారు. తొలి మ్యాచ్‌లో వీరోచితంగా పోరాడినా ఓటమి తప్పలేదు. రెండో మ్యాచ్ గెలిచినా.. మూడో మ్యాచ్‌కు పరిస్థితి మొదటికి వచ్చింది. 'ఏ ఆటలో అయినా అంతిమంగా విజయమే కొలమానం. ఒక పరుగు తేడాతో ఓడినా ఓడినట్లే. రాజస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓడిపోయి ఉండవచ్చు.. కానీ పాయింట్ల పట్టికలో అయితే తేడా రాదు కదా' అని విశ్లేషకులు అంటున్నారు. రాజస్థాన్ జట్టు గురువారం వాంఖడే స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుతో తలపడనున్నది. చెన్నై లాంటి స్లో పిచ్‌లపై మూడు మ్యాచ్‌లు గెలిచిన ఊపులో ఉన్న ఆర్సీబీని ఎదుర్కోవడం రాయల్స్‌కు పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా వాంఖడే పిచ్‌కు అలవాటు పడి ఉండటం రాయల్స్‌కు కలసి వచ్చే అంశం.

    ఇక రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా దూరమయ్యాడు. లండన్‌లో సర్జరీ చేసి కోలుకుంటున్న ఆర్చర్.. ఐపీఎల్ రెండో భాగంలో అయినా జట్టుతో చేరతాడా అనేది అనుమానమే. ఇక స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తొలి మ్యాచ్‌లోనే గాయపడి ఇంగ్లాండ్ తిరిగి వెళ్లాడు. యువ క్రికెటర్ లివింగ్‌స్టోన్ బయోబబుల్‌లో ఉండలేక జట్టును వీడి వెళ్లిపోయాడు. కీలకమైన ముగ్గురు విదేశీ క్రికెటర్లు జట్టుకు దూరమవడంతో రాయల్స్‌కు కష్టాలు తప్పడం లేదు.

    ఇక గురువారం జరిగే మ్యాచ్‌కు శ్రేయస్ గోపాల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు తప్పించిన శ్రేయస్ గోపాల్‌ను ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని కెప్టెన్, కోచ్ భావిస్తున్నారు. ఆర్సీబీలోని కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను ఇబ్బంది పెట్టిన రికార్డు శ్రేయస్‌కు ఉన్నది. అందుకే అతడిని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగానే ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: