Home /News /sports /

AB de Villiers : ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాకిచ్చిన డివిలియర్స్.. ఐపీఎల్ కి కూడా గుడ్ బై..

AB de Villiers : ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాకిచ్చిన డివిలియర్స్.. ఐపీఎల్ కి కూడా గుడ్ బై..

AB de Villiers

AB de Villiers

AB de Villiers : సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఫ్యాన్స్ కు షాకిచ్చాడు.

    సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఐపీఎల్ తో పాటు అన్ని క్రికెట్ లీగ్ లకు గుడ్ బై చెప్పాడు మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ప్రతీ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. తనలో క్రికెట్ ఆడే సత్తా ఏం తగ్గలేదని నిరూపించాడు. ఓ దశలో సౌతాఫ్రికా జట్టులో రీఎంట్రీ ఇస్తాడని కూడా ప్రచారం జరిగింది.

    ఏబి డివిలియర్స్.. ఈ పేరు వింటే ప్రత్యర్ధి జట్టు బౌలర్స్ కి హడల్.. తన అసాధారణ బ్యాటింగ్ తో గ్రౌండ్ లో బంతిని నలుమూలలా బౌండరీకి తరలించే ఈ ఆటగాడిని మిస్టర్ 360 అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఐపీఎల్ లో గత కొన్ని సీజన్ల నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న డివిలియర్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి ఫేజ్ లో ఫర్వాలేదనిపించిన.. యూఏఈలో జరిగిన రెండో దశ ఐపీఎల్ లో మాత్రం తన ఆటతో అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

    ఐపీఎల్ 2021లో ఆడిన 15 మ్యాచ్ లలో కేవలం 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులను సాధించిన ఏబిడి యూఏఈలో జరిగిన 8 మ్యాచ్ లలో 0,12,11,4,23,19,26,11 పరుగులతో విఫలమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఏబీడీ .. తాజాగా తన ఫామ్ తో పాటు వయస్సు రీత్యా రానున్న ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పెశాడు.

    దీంతో.. బెంగుళూరు జట్టు నుండి విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, మాక్స్ వెల్ తో పాటు సిరాజ్ లేదా చాహల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది బెంగుళూరు జట్టుకి టైటిల్ అందించి ఐపీఎల్ నుండి తప్పుకుందామనుకున్నా ఓటమితో నిరాశే మిగిలింది. ఇక బెంగుళూరు జట్టు బ్యాటింగ్ కి వెన్నెముకల ఇన్నాళ్ళు నిలబడ్డ ఏబి డివిలియర్స్ ఐపీఎల్ నుండి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL, Royal Challengers Bangalore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు