Home /News /sports /

Virat Kohli : అయ్యో.. నిన్ను ఇలా చూడలేం..! మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో..

Virat Kohli : అయ్యో.. నిన్ను ఇలా చూడలేం..! మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Virat Kohli : ఐపీఎల్‌ టైటిల్‌ ఈ సీజన్‌లోనూ బెంగళూరుకు అందని ద్రాక్షే అయ్యింది. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్‌గా వైదొలిగాడు.

  ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ఎలిమినేటర్ మ్యాచ్ (Eliminator) లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్ (Royal challengers Bangalore)​పై కోల్ కతా నైట్​ రైడర్స్​ (Kolkata night riders) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోలకతా ఆరు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఐపీఎల్‌–14 నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు నిష్క్రమించింది. విరాట్‌ కోహ్లి సారథ్యం కూడా నిరాశగానే ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్‌ సునీల్‌ నరైన్‌ (4 వికెట్లు, 15 బంతుల్లోనే 3 సిక్సర్లతో 26 పరుగులు) ఆల్‌రౌండ్‌ షోతో ఎలిమినేటర్‌లో బెంగళూరు పరాజయం పాలైంది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ ఈ సీజన్‌లోనూ బెంగళూరుకు అందని ద్రాక్షే అయ్యింది. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్‌గా వైదొలిగాడు. వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇంటిబాట పట్టింది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.

  2013 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్‌గా పని చేసిన కాలంలో ఆర్‌సీబీ ఒకసారి రన్నరప్(2016 ఐపీఎల్‌ సీజన్‌), మరో మూడుసార్లు ప్లేఆఫ్స్‌(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్‌గా ఆర్‌సీబీకి టైటిల్‌ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు.

  హేమాహేమీలు ఆ జట్టుకు ఆడినా.. ఎవరూ ఆర్‌సీబీ కప్పు కలను మాత్రం నెరవేర్చలేదు. అందరూ ఉత్తిచేతులతోనే జట్టు పగ్గాలు వదిలేశారు.2013లో డేనియల్‌ వెటోరి నుంచి విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. అప్పటినుంచి జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న కోహ్లీ.. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు కానీ ఒక్కసారీ కప్పు అందుకోలేదు. విరాట్ సారథ్యంలో 2016లో ఆర్‌సీబీ ఫైనల్ చేరుకుంది. మొత్తంగా మూడుసార్లు ఫైనల్‌ చేరినా ఆర్‌సీబీ టైటిల్‌ మాత్రం పట్టలేకపోయింది.

  ఇక గత మూడు సీజన్లలో అయితే పేలవ ఆటతో కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరలేకపోయింది. ఈసారి సీజన్‌ తొలి అంచెలో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేయడంతో మళ్లీ కప్పుపై ఆశలు రేగాయి. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్‌ అని విరాట్ ప్రకటించడంతో ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. బెంగళూరు ఆటగాళ్లు సైతం కోహ్లీ కోసం కప్పు సాధిస్తామని వాగ్దానాలు కూడా చేశారు.


  యూఏఈలో జరుగుతున్న రెండో అంచెలోనూ రాణించి ప్లే ఆఫ్స్‌ చేరడంతో.. ఆర్‌సీబీ టైటిల్‌కు చేరువవుతున్నట్లే కనిపించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా అభిమానుల ఆశలు, అంచనాలన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి. 13 ఏళ్లుగా జరుగుతున్నదే ఈసారీ రిపీట్ అయింది. విరాట్ కోసం కప్పు గెలుస్తామన్న మాటను అతడి సహచరులు నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఈసారి బెంగళూరు అభిమానుల వేదన మాత్రం అంతాఇంతా కాదు.


  ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ఎంతో తపించిన విరాట్.. చివరికి ఆ కల నెరవేర్చుకోకుండానే కెప్టెన్సీ విడిచిపెడుతుండటమే అందుకు ప్రధాన కారణం. మ్యాచ్ ఓటమి ఖరారు కాగానే ఆర్‌సీబీ అభిమానుల మొహాలు తేలిపోయాయి. ఇక మ్యాచ్ అవ్వగానే మైదానంలోనే వారు ఏడ్చేశారు. కంటతడి పెట్టుకొంటూ మైదానాన్ని వీడారు. గత సీజన్లలో ఆర్‌సీబీ లీగ్‌ దశల్లోనే నిష్క్రమించినపుడు కూడా ఉద్వేగానికి గురి కాకుండా తర్వాతి సీజన్ ఉందికదా అనుకుని మామూలుగా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు.

  కోహ్లీ కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. మైదానంలోనే ఏడ్చేశాడు. తన కళ్లలోకి వచ్చిన నీళ్లను తుడుచుకుంటూ కనిపించిన కోహ్లీ.. తన బాధను క్యాప్‌తో కవర్ చేశాడు. అది చూసిన ఫాన్స్ మరింత బాధకు గురయ్యారు. మరోవైపు ఏబీ డివిలియర్స్, మొహ్మద్ సిరాజ్ కూడా మైదానంలోనే కంటతడి పెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో, పోటీలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సారి ప్లేయర్ గా ఆర్సీబీ కప్ కల నెరవేరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2021, Royal Challengers Bangalore, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు