IPL 2022 ఛాంపియన్ ఎవరనదే 2 మ్యాచ్‌ల తర్వాత నిర్ణయించబడుతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. 72 మ్యాచ్‌ల తర్వాత, గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయ్. ఇక,ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం (మే 25) ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) యువ ప్లేయర్ రజత్ పాటీదార్ (Rajat Patidar)(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లను ఆకట్టుకున్నాడు. అయితే ఈ శతకంతో రజత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా పాటీదార్ గుర్తింపు పొందాడు.
ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పటిదార్ రాత్రికిరాత్రే హీరోగా మారిపోయాడు. 2021లో బెంగళూరు జట్టు తరఫున రజత్ 4 మ్యాచ్‌లు ఆడి 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ ఫిబ్రవరిలో నిర్వహించిన మెగా వేలంలో రజత్ పటిదార్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. బెంగళూరు కూడా అతడిని రిటెన్షన్ చేసుకోలేదు. అయితే, బెంగళూరు జట్టులో లవ్‌నీత్ సిసోడియా గాయపడటం వల్ల అతడి స్థానంలో రూ.20 లక్షలతో మళ్లీ బెంగళూరే రజత్‌తో ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, మెగా వేలంలో రజత్ పటిదార్‌ని ఎవరు కొనుగోలు చేయకపోవడం వల్ల మే 9న అతడి వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారట. బెంగళూరు జట్టు నుంచి పిలుపు రావడం వల్ల పెళ్లి వాయిదా వేశారట. 'రజత్ పటిదార్ వివాహన్ని మే 9న జరిపించాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ వేడుకను అంగరంగ వైభవంగా కాకుండా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిర్వహించాలనుకున్నాం. అందుకే ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదు.
ఇది కూడా చదవండి : జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల విధుల్లో ధోని.. వైరల్ గా మారిన ఫోటో.. అసలు మ్యాటర్ ఇదే..!
మే 9న రత్లాంకు చెందిన యువతితో రజత్‌కు వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేడుక నిర్వహించడానికి ఇండోర్‌లో ఓ హోటల్‌ని కూడా బుక్ చేశాం. ఇంతలోనే బెంగళూరు జట్టు నుంచి పటిదార్‌కి పిలుపు వచ్చింది. జూన్‌లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో పటిదార్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. కాబట్టి, జులైలో వివాహం జరిపించాలని ప్లాన్ చేస్తున్నాం' అని రజత్ పటిదార్ తండ్రి మనోహర్ పటిదార్ ఓ జాతీయ పత్రికతో అన్నారు.
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో అనూజ్ రావత్‌కు అవకాశం ఇచ్చిన ఆర్‌సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. రజత్ ను ఫస్ట్ డౌన్‌లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నరజత్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ యంగ్ గన్ ఇదే ఫామ్ క్వాలిఫయర్ -2 లో కూడా రిపీట్ చేస్తే ఆర్సీబీ దశాబ్దాల కల నెరవేరడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Royal Challengers Bangalore, Virat kohli, Wedding