హోమ్ /వార్తలు /క్రీడలు /

Ross Taylor Retirement: ముగిసిన శకం... కన్నీటితో క్రికెట్ కు వీడ్కోలు పలికిన కివీస్ దిగ్గజం

Ross Taylor Retirement: ముగిసిన శకం... కన్నీటితో క్రికెట్ కు వీడ్కోలు పలికిన కివీస్ దిగ్గజం

Ross Taylor Retirement: న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand)లో ఓ శకం ముగిసింది. 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా న్యూజిలాండ్ క్రికెట్ కు సేవలు చేసిన ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ రాస్ టేలర్ (Ross Taylor) క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

Ross Taylor Retirement: న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand)లో ఓ శకం ముగిసింది. 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా న్యూజిలాండ్ క్రికెట్ కు సేవలు చేసిన ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ రాస్ టేలర్ (Ross Taylor) క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 30న తన రిటైర్మెంట్ పై ప్రకటన చేసిన రాస్... తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మూడో వన్డేతో అన్ని ఫార్మాట్ల  క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.  2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.

బంగ్లాదేశ్ తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం టెస్టులకు వీడ్కోలు పలికిన రాస్ టేలర్... తాజాగా వన్డేల నుంచి కూడా తప్పుకున్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ జాతీయ గీతం పాడే సమయంలో టేలర భావోద్వేగానికి గురైయ్యాడు. జాతీయ గీతం పాడుతూనే కంటతడి పెట్టాడు. టేలర్ బ్యాటింగ్ కు వచ్చే సమయంలో నెదర్లాండ్స్ ప్లేయర్లు ’గార్డ్ ఆఫ్ ఆనర్‘తో టేలర్ కు స్వాగతం పలికారు.

టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు.

38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు  ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా రాస్ టేలర్ ఉన్నాడు.

First published:

Tags: Bangladesh, Cricket, IPL, IPL 2022, New Zealand, Retirement

ఉత్తమ కథలు