ఐపీఎల్ 14వ (IPL 2021) సీజన్లో భాగంగా మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (Kolkata Knight Riders) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అనేక ఆసక్తికరమైన రికార్డులు నెలకొన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అద్బుతమైన వ్యూహంతో లో స్కోరింగ్ మ్యాచ్‌ను కూడా గెలిపించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలవడంతో ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమైనా రోహిత్ ఇద్దరు స్పిన్నర్లనే జట్టులోకి తీసుకున్నాడు. అయితే స్పిన్నర్ల కోటా అయిపోయేసరికి ఎవరితో బౌలింగ్ చేయించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకో ఓవర్ జన్సెన్కు ఇద్దామనుకుంటే బ్యాట్స్‌మెన్ అతడిని టార్గెట్ చేసే అవకాశం దీంతో రోహిత్ శర్మనే ఒక ఓవర్ వేశాడు. పార్ట్ టైమ్ బౌలర్‌గా అప్పుడప్పుడు బౌలింగ్ చేసే శర్మ.. ఐపీఎల్లో ఏడేళ్ల తర్వాత బౌలింగ్ చేశాడు. అతను చివరి సారిగా 2014లో బౌలింగ్ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ బౌలింగ్ చేసినా తన ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. మార్కో జన్సెన్ ఐపీఎల్ ఆడటం ఇదే తొలి సారి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసి వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన మూడో క్రికెటర్ జన్సెన్. అంతకు ముందు గతంలో జెస్సీ రైడర్ (2009), ఆస్టన్ టర్నర్ (2019) ఇలాగే వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యారు.
"I just knew that in Chennai, if there’s anyone who can be a game-changer, it has to be a spinner." 👊🏻
🎥 Man of the Match @rdchahar1 speaks to the media at the post-match press conference!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.