Home /News /sports /

ROHIT SHARMAS TRANSFORMATION MAKES FANS HAPPY AND HIT MAN GIVES COMPETITION TO VIRAT KOHLI IN FITNESS GOALS SRD

Rohit Sharma : రోహిత్ శర్మ డెడికేషన్ కి సలామ్.. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీకి పోటీ ఇస్తోన్న హిట్ మ్యాన్..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఫిటెనెస్ విషయంలో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టేలా సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ. విమర్శకుల నోళ్లు మూయించేలా సన్నబడ్డాడు హిట్ మ్యాన్.

    దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) వారసత్వం.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో యువ ఆటగాళ్లకు స్పూర్తి కలిగిస్తాడు.. సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి.. బ్యాటర్ గా ముందుండి నడిపిస్తాడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి సారథిగా వెనకుండి ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా (Team India) హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma). అయితే, గత కొన్నాళ్లుగా రోహిత్ మెరుపులు టీమిండియా ఫ్యాన్స్ మిస్సవుతూనే ఉన్నారు. గాయంతో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన హిట్‌మ్యాన్ రోహిత్‌శ‌ర్మ బెంగ‌ళూర్‌లోని ఎన్‌సీఏ అకాడ‌మీలో కోలుకుంటున్నాడు. ఫిటెనెస్ విషయంలో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టేలా సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతుండటంతో శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టిన హిట్‌మ్యాన్ వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణుల సూచనల మేరకు బరువు తగ్గడంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే గత రెండు నెలల్లో అతను ఏకంగా 6 కిలోల బరువు తగ్గినట్లు ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.

    ఆ మధ్య రోహిత్ శర్మ తన న్యూలుక్‌ను అభిమానులతో పంచుకున్నప్పుడే అతను సన్నబడిన విషయం అందరికి తెలిసింది. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిసారించిన హిట్ మ్యాన్.. జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసి ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌గా మారాడు. బొద్దుగా ఉండే రోహిత్.. విరాట్ కోహ్లీలా సన్నబడ్డాడు. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలతో పాటు టెస్ట్ వైస్ కెప్టెన్సీని అందుకున్న హిట్ మ్యాన్.. పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నాడు.

    టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే తరుచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యే రోహిత్ శర్మ కెప్టెన్ చేస్తే జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.



    కెప్టెన్ అనేవాడు ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. రోహిత్‌కు టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే అతనిపై వర్క్‌లోడ్ పెరిగి గాయాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

    ఇక ఈ విమర్శలు చెక్‌పెట్టే విధంగా రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాలనుకున్న హిట్ మ్యాన్.. పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టేందుకు తాను అర్హుడునేనని చాటి చెప్పేందుకు రెడీ అయ్యాడు.

    ఇది కూడా చదవండి : భారత నయా ఆల్‌రౌండర్ కోసం సన్‌రైజర్స్ మాస్టర్ స్కెచ్.. ఎంతైనా సరే తగ్గేదే లే..

    గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్.. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే వన్డే, టీ20 సిరీస్‌లతో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ లో రోహిత్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఐదు సార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపాడు. దీంతో.. సెలెక్టర్లు రోహిత్ పై భారీ నమ్ముకముంచారు. ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ లు ఉన్నాయ్. ఈ రెండింటిలోనూ రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమిండియా బరిలోకి దిగే ఛాన్సుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Rohit sharma, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు