• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ROHIT SHARMAS PLACE IN THE INDIAN PLAYING 11 SA

Rohit sharma: జట్టులో అడుగుపెట్టిన రోహిత్.. ఎవరి స్థానంలో బరిలోకి దిగనున్నడంటే!

Rohit sharma:  జట్టులో అడుగుపెట్టిన రోహిత్.. ఎవరి స్థానంలో బరిలోకి దిగనున్నడంటే!

rohith

రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు.

  • Share this:
    రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు. ఇన్ని రోజులు
    క్వారంటైన్‌‌లో హిట్ మ్యాన్ బుధవారం మెల్‌బోర్న్‌లో భారత జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్‌ను సెలక్టర్లు ఆసీస్ టూర్‌కు ఎంపీక చేయాలేదు. ఈ పరిణామం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. రోహిత్ ఎంపీక చేయకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు,అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఈ వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు రోహిత్‌కు వివిధ పరిక్షలు నిర్వహించి టెస్ట్ సిరీస్‌కు ఎంపీక చేశారు.

    రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళిన అతను కరోనా ప్రోటోకాల్ నేఫథ్యంలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ క్వారంటైన్ నిబంధన ముగియడంతో బుధవారం సహచరులతో కలిసి సాధన మెుదలుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ వరుస విఫలమవుతుండడంతో అతని స్థానంలో రోహిత్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.

    ఫిట్‌నెట్ కోసం బెంగళూర్ జాతీయ ఆకాడమీలో శిక్షణ

    ఐపీఎల్ ఆడుతుండగా.. రోహిత్ తొడ కండరాల గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన హిట్ మ్యాన్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో టెస్టు సిరీస్ కోసం రోహిత్‌ను ఆస్ట్రేలియాకు బీసీసీఐ పంపింది. టెస్టు సిరీస్‌కి ఎంపికైన రోహిత్ శర్మ.. చివరి రెండు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు. బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండటంతో.. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం అతడు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నిబంధనల కారణంగా డిసెంబర్ చివరికి గానీ రోహిత్ శర్మ జట్టుతో చేరలేదు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు