రోహిత్ శర్మ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్‌పై నెటిజన్ల సెటైర్లు..

ICC Cricket World Cup 2019 | రోహిత్ శర్మ కూడా.. ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టి.. కళ్లు కనిపించడం లేదా అన్నట్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక నెటిజన్లు ఆ వివాదంపై ఎలా స్పందిస్తున్నారో మీరూ చూడండి..

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 5:32 PM IST
రోహిత్ శర్మ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్‌పై నెటిజన్ల సెటైర్లు..
రోహిత్ శర్మ అవుట్‌పై వివాదం
  • Share this:
ఇది ఎన్నటికీ మరిచిపోలేని ప్రపంచకప్.. ఎందుకంటే వర్షాలతో కొన్ని మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోగా, కొన్ని జట్లు అనూహ్య విజయాలు సాధించాయి. మరికొన్ని జట్లు పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇక, అన్నింటి కంటే ముఖ్యంగా ‘అంపైర్లు’ అన్న పేరెత్తితే చాలు.. ఈ ప్రపంచకప్ కచ్చితంగా గుర్తుకొస్తుంది. వాళ్లు అంతలా విఫలమయ్యారు మరి. రివ్యూ సిస్టం ఉండి ఆటగాళ్లు బతికిపోతున్నారు గానీ, లేకపోయి ఉంటేనా.. ఊహించని విధంగా జట్లు అంపైర్ల దెబ్బకు బలై ఉండేవారు. ఇకపోతే రివ్యూ సిస్టంది కూడా ఎంత దీన స్థితి అంటే.. రోహిత్ శర్మ నాటౌట్ అయినా అవుట్ అని ప్రకటించాడు థర్డ్ అంపైర్. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా కీమర్ రోచ్ బౌలింగ్‌లో కీపర్ షాయ్ హోప్‌కి రోహిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐతే విండీస్ ఆటగాళ్లు చేసిన అప్పీల్‌ను మొదట ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అతడు నాటౌట్‌గా ప్రకటించడంతో విండీస్ కెప్టెన్ హోల్డర్ రివ్యూ కోరాడు. అనంతరం థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

ప్యాడ్‌కు తగిలిందా.. లేక బ్యాట్‌కు తగిలిందా.. అన్నది చూసుకోకుండానే థర్డ్ అంపైర్ రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు. బంతి బ్యాట్‌కు తగలలేదు. ప్యాడ్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, చర్యపై నెటిజన్లు థర్డ్ అంపైర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్లే కాదు.. రోహిత్ శర్మ కూడా.. ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టి.. కళ్లు కనిపించడం లేదా అన్నట్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక నెటిజన్లు ఆ వివాదంపై ఎలా స్పందిస్తున్నారో మీరూ చూడండి..










Published by: Shravan Kumar Bommakanti
First published: June 28, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading