జడ్డూని కొట్టాలనుకున్న రోహిత్ శర్మ!?

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:22 PM IST
జడ్డూని కొట్టాలనుకున్న రోహిత్ శర్మ!?
Rohit sharma with Ravindra jadeja
  • News18
  • Last Updated: June 6, 2019, 2:22 PM IST
  • Share this:
సీనియర్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాడు రోహిత్ శర్మ. భీకరమైన బ్యాటింగుతో అనితర సాధ్యమైన రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో రెండు ద్విశతకాలు నమోదుచేసిన రోహిత్, ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ (264 పరుగులు) గా కూడా రికార్డు సృష్టించాడు. మైదానంలో బ్యాటింగులో చెలరేగిపోయే ఈ బ్యాట్స్ మెన్ బయట మాత్రం కూల్ గా కనిపిస్తాడు. అయితే ఇంతటి కూల్ పర్సనాలిటీకి కూడా కోపం తెప్పించాడట జడ్డూ... అదేనండీ మన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని భారత ఓపెనర్ అజింకా రహానే బయటపెట్టాడు.

కమెడియన్ విక్రమ్ సతాయే నిర్వహిస్తోన్న ఓ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న రహానే... దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో కొద్ది ఖాళీ సమయం దొరకగానే రహానె, అతని భార్య రాధికా, రోహిత్ శర్మ, తన భార్య రికితా, జడేజా కలిసి వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు వెళ్లారట. అయితే జడేజా కొంచెం తుంటరి, అల్లరి పిల్లవాడు అనే సంగతి తెలిసిందే. వీరు ప్రయాణిస్తున్న వాహానానికి కొద్ది దూరంలో ఓ చిరుత పులి, తాను వేటాడిన జంతువు మాంసాన్ని తింటూ కనిపించిందట. అంతే జడేజా దాన్ని చూసి రకరకాలు అరుస్తూ గోల చేయడం మొదలెట్టాడట. జడ్డూ అరుపులకి విసుగు చెందిన చిరుత, వీరి వైపు కోపంగా చూసిందట. అంతే జరగబోయే ప్రమాదం అంచనా వేసిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కొట్టబోయినంత పని చేశాడట.

ఎప్పుడూ కూల్ గా ఉండే రోహిత్ శర్మ, అలా కోపగించుకోవడంతో తామంతా ఆశ్చర్యపోయామని, అయితే రోహిత్ అలా చేయకపోయి ఉంటే జడ్డూ కారణంగా ఆరోజు మేము పెద్ద ప్రమాదంలో పడేవాళ్లమని చెప్పుకొచ్చాడు అజింకా రహానే. రోహిత్ శర్మ భారత క్రికెటర్ గానే కాకుండా ఐపీఎల్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కి కూడా చేరుకోలేకపోయిన ముంబై జట్టు... మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచింది.
Published by: Ramu Chinthakindhi
First published: June 6, 2018, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading