Rohit Sharma : రోహిత్ శర్మ బీఫ్ తిన్నాడా..? హిట్ మ్యాన్ కు బిల్లు తెచ్చిన చిక్కులు..

టీమిండియా ప్లేయర్స్

Rohit Sharma : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ సహా నలుగురు క్రికెటర్లు న్యూ ఇయర్ సందర్భంగా ఓ హెటల్ కు వెళ్లారు. క్రికెటర్ల బిల్లును ఓ అభిమాని కట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ బిల్లే రోహిత్ శర్మకు కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

  • Share this:
    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు కీలక పరిమాణం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్ మెంట్ ఐసోలేషన్ లో ఉంచింది. న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా ఎఫెక్ట్ తో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ను బయో బబుల్ లో నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడగ దాటి వెళ్లకూడదు. ఐతే ఆ హోటల్‌లో వారు కూర్చున్న టేబుల్ పక్కనే నవలదీప్ సింగ్ అనే ఇండియన్ కూర్చున్నాడు. టీమిండియా క్రికెటర్లు అక్కడే ఉన్నారని తెలిసి అతడు ఎంతో సంతోషపడ్డాడు. వారు భోజనం చేస్తుండగా వీడియో తీశాడు. అందులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, నవదీప్ సైని కనిపించారు. ఐతే వారి భోజనం ఇక పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్‌దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టాడు. ఇప్పుడే ఆ బిల్లే హిట్ మ్యాన్ కు కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. బిల్లు కట్టినోడు, కట్టినట్టు ఉండక... సోషల్ మీడియాలో బిల్లుతో సహా పోస్టు చేశాడు.


    ఫ్యాన్ తాను బిల్లు కట్టిన ఫోటోతో పాటు టీమిండియా క్రికెటర్లు రెస్టారెంట్‌లో కలిసి తింటున్న ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. భారత క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తుకి ఆదేశించగా... బీసీసీఐ కూడా ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పింది. ఇప్పటికే ఈ ఐదురుగు క్రికెటర్లు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడు ఈ విందు మరో కొత్త చిక్కు తీసుకొచ్చింది. వివాదం మొత్తం రేగడానికి కారణమైన ఈ బిల్లు... ఇప్పుడు రోహిత్ శర్మపై నెటిజన్ల ట్రోలింగ్‌కి కారణమైంది.






    ఆ ఫ్యాన్ పోస్టు చేసిన ఫోటోలో చికెన్, పోర్క్, రొయ్యలతో పాటు బీఫ్ కూడా ఆర్డర్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో ‘శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడంటూ’ నెటిజన్లు రోహిత్ శర్మను టార్గెట్ చేస్తే బీభత్సమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ‘వడా పావ్ కింగ్’ బీఫ్ తింటున్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ పూర్తి వెజిటేరియన్ అని, కోడి గుడ్లు తప్ప మాంసాహారం తినడని వాదిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. అయితే ఈ బిల్లులో అ డైట్ కోక్స్ మినహా ఒక్క వెజిటేరియన్ ఐటెమ్ కూడా లేకపోవడం విశేషం.
    Published by:Sridhar Reddy
    First published: