ఆసీస్ టూర్‌కు ప్రకటించిన ఆటగాళ్ళ జాబితాలో రోహిత్ పేరు లేకపోవడం ఎంతటి దూమారాన్ని లేపిందో అందరికి తెలిసిందే!. ఈ విషయంపై ఇనాళ్ళు మౌనంగా ఉన్న తాజాగా వివరణను ఇచ్చింది. రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. సీనియర్ క్రికెటర్లు,విరాట్ కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు వివరణ ఇచ్చింది. తన తండ్రి అనారోగ్యం కారణంగానే రోహిత్ దుబాయ్ నుంచి నేరుగా ముంబైకి వెళ్ళాడని తెలిపింది.
అయితే తాజాగా ఈ ఆంశంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. రోహిత్ ఫిట్నెస్ విషయంపై బోర్డుకు మాత్రమే
తెలుసని వివరించారు. రోహిత్ శర్మ ఫిట్ అతన్ని వెంటనే ఆస్ట్రేలియా టూర్‌కు పంపించాలని తెలిపారు. అతనిపై ఫిట్‌నెస్‌పై ఎలాంటి విషయం తెలయదని, రోహిత్ ఆడేందుకు సిద్దండా ఉంటే వెంటనే ఆసీస్ టూర్ అతన్ని పంపించాలని తెలిపారు. "రోహిత్ సమర్ధవంతమైన ఓపెనర్, అతనితో జట్టులో ఉంటే సమాతూల్యంగా ఉంటుంది. ప్రస్తుత జట్టులో రోహిత్ ప్రెసెన్స్ చాలా ముఖ్యం. రోహిత్ ఫిట్నెస్ టెస్ట్‌లో విజయవంతం అయితే ఏమాత్రం ఆలోచన లేకండా ఆస్ట్రేలియాకు పంపాలి. అతని ఫిట్‌నెట్ రిపోర్ట్‌పై నాకేమి తెలియదు. ఆ విషయం బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుస"న్నారు.
Published by:Rekulapally Saichand
First published:December 10, 2020, 13:13 IST