భారత క్రికెట్ జట్టు కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను బీసీసీఐ ప్రకటించింది. జనవరి 2022లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ను ప్రారంభం కానుంది. అప్పటి నుంచి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా మిస్టర్ రోహిత్ శర్మను ODI & T20I జట్లకు కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) డిసెంబర్ 8, 2021న తన అధికారిక ట్విట్టర్ ఖాతలో ట్వీట్ చేసింది. ఈ ఏడాది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బోర్డు ప్రకటించింది. అయితే తాజా ట్విట్‌తో బోర్డు కెప్టెన్ ఎవరో స్పష్టం చేసింది.
T20 ప్రపంచ కప్ తర్వాత భారతదేశం యొక్క T20I సారథిగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్, ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌తో జరిగిన మూడు T20I సిరీస్‌లో నాయకత్వం వహించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 3-0తో సునాయాసంగా గెలుచుకుంది.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
ఇప్పటికే భారత టీ20 కెప్టెన్‌గా కోహ్లి వైదొలగడంతో, రోహిత్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌కు రోహిత్ సిద్ధం కావడానికి ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం ఉంది.
Hardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా గుడ్ బై? సుదీర్ఘ ఫార్మాట్ వదిలేయడానికి అసలు కారణం ఇదే
ఈ సిరీస్ తర్వాత 2023లో భారతదేశంలో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఉంటుంది. రోహిత్ శర్ కెప్టెన్సీలో రాహుల్ ద్రవిడ్ కోచ్ భాగస్వామ్యంతో, రాబోయే రెండు ICC ఈవెంట్‌లు సవాలుగా ఉండనున్నాయి గత టీ20 ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత, సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైన టీమ్ ఇండియాకు వచ్చే టోర్నమెంట్‌లు ఎంతో ముఖ్యం కానున్నాయి. 8 ఏళ్ల తరువాత ఇండియాలో ఐసీసీ ఈవెంట్ జరుగుతోంది.
రోహిత్ ట్రాక్ రికార్డు..
రోహిత్ 10 వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించగా.. ఇందులో టీమ్ ఎనిమిది గెలిచింది. 2018లో కోహ్లి గైర్హాజరీలో, UAEలో జరిగిన ఆసియా కప్‌ను భారత్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి, 2018లో రోహిత్ ODI కెప్టెన్సీ యొక్క అతిపెద్ద విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన టై మినహా జట్టు అన్ని లీగ్ మ్యాచ్‌లను గెలుచుకుంది.
విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ..
2017లో ధోని తరువాత భారత ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా కోహ్లీ (Kohli) బాధ్యతలు స్వీకరించారు. కోహ్లీ సార్ధ్యంలో ఇండియన్ టీం 70.43 విజయ శాతంతో నిలిచింది. దీంతో కోహ్లీ విజయవంతమైన వన్డే కెప్టెన్‌గా అవతరించాడు. కోహ్లీ 95 గేమ్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా 65 గెలిచి 27 ఓడిపోయింది. ధోనీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ తర్వాత భారత కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Rohit sharma, Rohith sharma, Virat kohli