ROHIT SHARMA MAY BE APPOINTED AS ODI CAPTAIN BCCI TOP BRASS IN DISCUSSION OF VIRAT CAPTAINCY FUTURE JNK
Rohit as Captain: కోహ్లీ వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ ఎసరు? అతడి స్థానంలో రోహిత్‌కు పగ్గాలు అప్పగించేందుకు రెడీ..!
వన్డే ఫార్మాట్ పగ్గాలు కూడా రోహిత్ శర్మకే!!
Rohit as ODI Captain: ఇప్పటికే టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి విరాట్ కోహ్లీని.. వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తున్నది. కేవలం టెస్టు కెప్టెన్సీకే పరిమితం చేసి అతడి బ్యాటింగ్‌పై భారం లేకుండా చూడాలని బీసీసీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ (Virat Kohli) త్వరలో వన్డే కెప్టెన్సీ కూడా కోల్పోనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు బీసీసీఐ (BCCI) కోహ్లీ కెప్టెన్సీపై విస్తృతమైన చర్చ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల టీ20 కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు (Rohit Sharma) అప్పగించారు. న్యూజీలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టుకు అజింక్య రహానే (Ajinkya Rahane) కెప్టెన్‌గా నియమించింది. ఇక రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ లేనందుకు దానిపై ఇప్పటి కిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉన్నది. ఈ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది. దీనికి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. కోహ్లీని వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పించి.. కేవలం రెడ్ బాల్ క్రికెట్‌కు మాత్రమే కెప్టెన్‌గా పరిమితం చేయాలనేది బీసీసీఐ ఆలోచన. అలా చేయడం ద్వారా కోహ్లీ బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. న్యూజీలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీతో పాటు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కూడా మాట్లాడిన అనంతరం దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా కోహ్లీ భవిష్యత్‌పై చర్చ చేయాలని బీసీసీఐ ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారని... అతడిపై కెప్టెన్సీ భారాన్ని తగ్గించడం ద్వారా బ్యాటింగ్‌పై మరింతగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని బోర్డు కోరుకుంటున్నది. కోహ్లీ ఫామ్‌లో ఉంటే టీమ్ ఇండియాకు తప్పకుండా బలం చేకూరుతుంది అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. న్యూజీలాండ్ సిరీస్ అనంతరం బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలసి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీ కెప్టెన్సీపై వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రవిశాస్త్రి.. కోహ్లీ కెప్టెన్సీ విషయంపై పలు వ్యాఖ్యలు చేశారు. 'సుదీర్ఘ ఫార్మాట్లో గత ఐదేళ్లుగా భారత జట్టు కోహ్లీ నేతృత్వంలో నెంబర్ 1 జట్టుగా కొనసాగింది. అతడు మానసికంగా అలసి పోయి ఉండి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటే కోహ్లీ తప్పకుండా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతాడు. ఇది ఇప్పటికిప్పుడే జరగక పోవచ్చు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేయడానికి కూడా చాలా కాలం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మిగిలిన ఫార్మాట్ల కోసం కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పి కేవలం టెస్ట్ కెప్టెన్సీకే పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అతడి మనసు, శరీరం ఎలా చెబితే అతడు ఆ నిర్ణయం తీసుకుంటాడు. గతంలో ఎంతో మంది విజయవంతమైన కెప్టెన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కోహ్లీ ఏమీ మొదటి వాడు చివరి వాడు కాదు' అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.