ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ దూకుడు...టాప్ ర్యాంకులో టీమిండియా...

కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, రోహిత్ శర్మ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే మయాంక్ అగర్వాల్ సైతం 38 స్థానాలు మెరుగు పరుచుకుని 25వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు.

news18-telugu
Updated: October 8, 2019, 10:16 PM IST
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ దూకుడు...టాప్ ర్యాంకులో టీమిండియా...
రోహిత్ శర్మ (ఫైల్)
  • Share this:
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. అలాగే డబుల్ సెంచరీతో కదంతొక్కిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం పొందాడు. ఇక బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమిలు కూడా తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు. అలాగే రహానె, చటేశ్వర్ పుజారాలు కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, రోహిత్ శర్మ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే మయాంక్ అగర్వాల్ సైతం 38 స్థానాలు మెరుగు పరుచుకుని 25వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ టెన్‌లో నిలిచాడు. విఖాఖ టెస్టులో 8 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్ ర్యాంక్ మెరుగైంది. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. న్యూజిలాండ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది.
First published: October 8, 2019, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading