హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit sharma: రోహిత్ ట్విట్టర్ అకౌంట్ లో కలకలం... అర్థం పర్థం లేని ట్వీట్లతో అయోమయంలో అభిమానులు

Rohit sharma: రోహిత్ ట్విట్టర్ అకౌంట్ లో కలకలం... అర్థం పర్థం లేని ట్వీట్లతో అయోమయంలో అభిమానులు

Rohit Sharma

Rohit Sharma

Rohit sharma: టీమిండియా (Team India) సారథి రోహిత్ శర్మకు ఏమైంది. గత ఐదు గంటలుగా అతడి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎందుకు అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తున్నాయి. రోహితే కావాలని పెడుతున్నాడా... లేక ఎవరైనా చేస్తున్నారా.?

Rohit Sharma: టీమిండియా (Team India) కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ (Rohit sharma) జోరు మీద ఉన్నాడు. వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో రోహిత్ కెప్టెన్సీకి పేరు పెట్టలేం. ఇప్పటికే ఐపీఎల్ (IPL) ముంబై ఇండియన్స్ (Mumbai indians) జట్టుకు ఐదు టైటిల్స్ ను అందించిన అతడు... న్యూజిలాండ్ (New zealand)తో జరిగిన సిరీస్ ద్వారా టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓటమనేదే లేకుండా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ మార్చి నాలుగు నుంచి శ్రీలంక (Srilnank)తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. అయితే మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు రావడం కలకలం రేపింది.

రోహిత్ శర్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అటు ఇన్ స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్ లలో అతడిని కోట్ల మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. అయితే మంగళవారం ఉదయం నుంచి రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి ’ నాకు కాయిన్స్ ను ఎగరవేయడం అంటే ఇష్టం... అది నా కడుపులోకి చేరుకుంటే ఇంకా బాగుంటుంది‘ అని ట్వీట్ పెట్టాడు. రోహిత్ నుంచి ఇటువంటి ట్వీట్ రావడంతో అతడి అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అర్థం లేని ట్వీట్లు ఎందుకు పెడుతున్నావంటూ కొందరు కామెంట్స్ చేయగా... మరికొందరు రోహిత్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ కామెంట్స్ పెట్టారు. కొన్ని గంటల తర్వాత రోహిత్ ఖాతాలో మరో అర్థం లేని ట్వీట్ ప్రత్యక్షమైంది. మరికాసేపటికే ’క్రికెట్ బాల్స్ ను తినొచ్చు కదా?‘ అంటూ మరో ట్వీట్ రావడంతో రోహిత్ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే అకౌంట్ హ్యాక్ అయిన విషయంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు స్పందించలేదు. అసంబద్దమైన, అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తుండటంతో అతడి ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైనట్లు అనుమానిస్తున్నారే తప్ప ఇంకా రూడీ కాలేదు. ఈ ట్వీట్లపై రోహిత్ త్వరలోనే స్పందించే అవకాశం కూడా ఉంది.

First published:

Tags: IPL, Mumbai Indians, Rohit sharma, Srilanka, Team India, West Indies

ఉత్తమ కథలు