అతడే ఆల్‌టైం అత్యుత్తమ వన్డే ఓపెనర్: శ్రీకాంత్‌

Rekulapally Saichand
Updated: July 1, 2020, 2:19 PM IST
అతడే ఆల్‌టైం అత్యుత్తమ వన్డే ఓపెనర్: శ్రీకాంత్‌
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Image: Cricket Next)
  • Share this:
టీమ్‌ ఇండియా స్టార్‌ బాట్స్‌మెన్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆల్‌టైం ఫేవరెట్‌ వన్డే ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒక్కడన్నారు. ఓ టీవీషో ముఖాముఖాలో పాల్గోన్న శ్రీకాంత్‌, హిట్ మ్యాన్‌ను పోగడ్తలతో ముంచెత్తారు.

"రోహిత్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతంగా ఉంటుంది. వన్డే మ్యాచ్‌లో 150, 180, 200 పరుగులు సాధించడం గొప్ప విషయం. రోహిత్ ఇప్పటివరకు 224 వన్డేలు ఆడి 29శతకాలు సాధించాడు. శ్రీలంకతో 2014లో ఈడెన్‌ గార్డెన్స్‌ జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 264 పరుగులతో అద్భుత బ్యాటింగ్‌ చేసి టీమిండియాను గెలిపించాడు. టాప్‌-3 లేదా 5 బ్యాటింగ్ దిగ్గజలలో రోహిత్ ఉంటాడు. సెంచరీలు,హఫ్ సెంచరీలు చేయడంలో అతడు దిట్ట" అంటూ హిట్‌మ్యాన్‌ను పొగడారు

గత కొద్దీ రోజులుగా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మాజీల నుంచి ప్రస్తుత ఆటగాళ్ల అందరూ రోహిత్‌ను పోగుడుతూనే ఉన్నారు.అతని ఆటతో పాటు నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తున్నారు.
First published: July 1, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading