Home /News /sports /

ROHIT SHARMA HAS SHARED A CHEEKY POST ABOUT AHMEDABAD PITCH AND HITMAN WAS TROLLED BY WIFE RITIKA SAJDEH SRD

Rohit Sharma : అహ్మదాబాద్ పిచ్ పై రోహిత్ శర్మ ఫన్నీ పోస్ట్..ట్రోల్ చేసిన భార్య రితికా

Rohit-Ritika (Photo : Instagram)

Rohit-Ritika (Photo : Instagram)

Rohit Sharma : కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్‌ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్‌ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరికి టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

ఇంకా చదవండి ...
    కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్‌ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్‌ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరికి టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సిరీస్ లో 2-1తో ముందడుగు వేసింది. టెస్టు క్రికెట్‌ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్‌ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. అయితే రెండు రోజుల్లోనే టెస్ట్ ముగియడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెటర్లు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిపై టీమిండియా క్రికెటర్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రోహిత్ శర్మ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న రోహిత్.. ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలో పచ్చికపై పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దానికి " పిచ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా" అంటూ క్యాప్షన్ పెట్టాడు. పిచ్ లపై విమర్శలు చేసే వారికి కౌంటర్ గా ఈ పోస్ట్ చేశాడు రోహిత్.

    అయితే, ఈ ఫొటో చూసిన రోహిత్ భార్య రితిక అతన్ని ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. "మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్" అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, పింక్ మ్యాచ్ విక్టరీతో వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి దూసుకెళ్లింది.





    అయితే, చివరి టెస్ట్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా ఫైనల్లో అడుగుపెడుతోంది. ఒక వేళ ఇంగ్లండ్ గెలిస్తే..ఆస్ట్రేలియాను అదృష్టం వరించనుంది. చివరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs england, Rohit sharma

    తదుపరి వార్తలు