Viral Video : రోహిత్ ఏంటి పంత్‌కు మిడిల్ ఫింగర్ చూపించాడు..కారణం తెలిస్తే నవ్వులే..

Photo Credit : Instagram

Viral Video : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, యంగ్ డైనమైట్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఇద్దరూ చాలా సరదాగా ఉంటారు. గ్రౌండ్ లోనైనా, బయట అయినా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫన్నీగా ఉంటారు. రిషభ్ పంత్ ను రోహిత్ శర్మ చాలా సార్లు ఆటపట్టించిన వీడియోలు మనం చూశాం. లేటెస్ట్ వీరిద్దరికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Share this:
    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, యంగ్ డైనమైట్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఇద్దరూ చాలా సరదాగా ఉంటారు. గ్రౌండ్ లోనైనా, బయట అయినా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫన్నీగా ఉంటారు. రిషభ్ పంత్ ను రోహిత్ శర్మ చాలా సార్లు ఆటపట్టించిన వీడియోలు మనం చూశాం. లేటెస్ట్ వీరిద్దరికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ, పంత్ కు మిడిల్ ఫింగర్ చూపించాడు.అయితే రోహిత్ అలా చూపించడానికి కారణం కరోనా టెస్ట్. అవును ప్రస్తుతం బయో బబుల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లు.. నిబంధనల మేరకు తరుచూ కోవిడ్ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తొలి వన్డే అనంతరం టెస్ట్ చేయించుకున్న రోహిత్ శర్మను.. రిషభ్ పంత్ సరాదాగా పలకరించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా కొంత ఫన్ క్రియేట్ చేయాలని వీడియో కూడా తీశాడు. కానీ కరోనా టెస్ట్‌తో తీవ్ర చికాకుకు గురైన హిట్ మ్యాన్ తన ఫ్రస్టేషన్‌ను పంత్‌పై చూపించాడు. కరోనా టెస్ట్ కోసం ముక్కు నుంచి శాంపిల్స్ తీసిచ్చిన రోహిత్ శర్మను "కైసే హో భయ్యా?' (ఎలా ఉంది?) " అంటూ ప్రశ్నించాడు. దీంతో చాలా అసహనానికి గురైన రోహిత్ శర్మ తన మిడిల్ ఫింగర్ చూపించాడు.

    ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న పంత్.. కరోనాతో క్రికెటర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. పంత్‌తో ఉన్న చనువుతోనే రోహిత్ అలా చూపించాడని, అందులో తప్పేముందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


    ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో రిషభ్ పంత్‌కు అవకాశం దక్కలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి అదరగొట్టాడు. ఇక రోహిత్ శర్మ(28) అంచనాలు అందుకోలేకపోయాడు. వుడ్‌ వేసిన బంతి రోహిత్‌ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే అతను గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వన్డేకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇక సస్పెన్స్ గా నే ఉంది. రెండో వన్డే ఈ నెల 26న పుణె వేదికగానే జరుగుతోంది.
    Published by:Sridhar Reddy
    First published: