T20 World Cup: ఒక్క ఫొటోలో ఇన్ని అర్థాలున్నాయా? రోహిత్ శర్మ అంత ఆలోచించాడా? కేఎల్ రాహుల్ ఎందుకలా జెర్సీ లాక్కుంటుండు?

అవునా? ఈ ఫొటోలో అంత అర్థం ఉన్నదా? (PC: MPL/BCI)

T20 World Cup: టీ20 వరల్డ్ కోసం బీసీసీఐ రూపొందించిన కొత్త జెర్సని విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను ఎంపీఎల్ విడుదల చేసింది. ఈ ఫొటోపై ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 • Share this:
  అదేంటో కొంత మందికి రామా అన్నా బూతులా వినపడుతుంది. అది అన్న వాళ్ల తప్పకాదు.. కానీ విన్నోడి తప్పు. వినేటోళ్లు ఏ మూడ్‌లో ఉంటే వాళ్లకు ఎదుటి వాళ్ల మాటలు అదే మూడ్‌లో వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీమ్ ఇండియా (Team India) కోసం బీసీసీఐ (BCCI) ఇటీవల కొత్త జెర్సీని విడుదల చేసింది. ఎంపీఎల్ (MPL) స్పోర్ట్స్ అపారెల్ కంపెనీ టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉన్నది. వాళ్లే ఆ జెర్సీని డిజైన్ చేశారు. నేవీ బ్లూ కలర్‌లో ఉన్న జెర్సీని టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు అంకితం ఇచ్చారు. కోట్లాది మంది అభిమానుల స్వరాలను సౌండ్ ఫ్రీక్సెన్సీ ప్యాట్రన్‌గా మార్చి జెర్సీపై ముద్రించారు. అంతే కాకుండా ఎంపీఎల్, బీసీసీఐ, బైజూస్ లోగోలతో పాటు ఇండియా అని రాసి ఉన్నది. అలాగే బీసీసీఐ లోగోపై మూడు వరల్డ్ కప్‌లకు గుర్తుగా మూడు స్టార్లు ముద్రించారు. ఈ జెర్సీని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. ఎంపీఎల్ విడుదల చేసిన ఫొటోలో కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumra) ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నది. కానీ ఆ ఫొటో చూసిన అభిమానులు మాత్రం ఆటగాళ్ల ఫోజులపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

  విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా బీసీసీఐ లోగో వైపు వేలు చూపిస్తుండగా.. రోహిత్ శర్మ ఇండియా అని రాసున్నవైపు వేలు చూపిస్తున్నాడు. దీనిపై ఫ్యాన్స్ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ముగ్గురూ బీసీసీఐ కోసం క్రికెట్ ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు బీసీసీఐ భారీగా డబ్బులు ముట్టజెపుతున్నది. అందుకే డబ్బు కోసం ఆడుతున్నారు కాబట్టే బీసీసీఐ లోగో వైపు చూపిస్తున్నారు. కానీ రోహిత్ శర్మ ఇండియా కోసం ఆడుతున్నాడు. అతడు ఎప్పుడూ దేశం కోసమే ఆడతాడు. అతడికి డబ్బు, పరపతి కంటే ఇండియానే ముఖ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు. @NotMK45 అనే ట్విట్టర్ యూజర్ మొదటిగా ఇలా రాసుకొని వచ్చాడు. దీనిపై ఇతర ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజమే రోహిత్ శర్మ ఇండియాను చూపిస్తున్నాడని అంటున్నారు. అయితే మరొక ఫ్యాన్ అయితే అతడు ఇండియా వైపు కాదు బైజూస్ వైపు చూపిస్తున్నాడు. అది టీమ్ ఇండియా స్పాన్సర్ అందుకే అటు చూపిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. దానికి మరొకరు అవును యువతను మంచిగా చదువుకోమని సలహా ఇస్తున్నాడు అందుకే బైజూవ్ వైపు చూపిస్తున్నాడని కామెంట్స్ చేశారు.

  IPL 2021- Final: ఐపీఎల్ దక్కేది ఎవరికో? నేడే ఫైనల్.. టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీ  ఇక ఇదంతా అలా ఉంటే.. కేఎల్ రాహుల్ జెర్సీని గుంజి పట్టుకున్నాడు. షర్ట్ క్లాత్ క్వాలిటీ బాగుందో లేదో అని కేఎల్ రాహుల్ చెక్ చేస్తున్నాడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసలు వాల్ల అలా ఎందుకు ఫోజ్ ఇచ్చారో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఎవరి తోచినట్లుగా వాళ్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ ఫొటోలో ఇంత అర్దం ఉందా అని మరి కొంత మంది ఆశ్చర్యపోతున్నారు.
  Published by:John Naveen Kora
  First published: