Rohit Sharma: కివీస్‌తో వన్డే, టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్...

Rohit Sharma: India vs New Zealand| కివీస్ వన్డే సిరీస్ టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పిక్క కండరాలు పట్టేయడంతో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన జారీ చేసింది.

news18-telugu
Updated: February 3, 2020, 5:43 PM IST
Rohit Sharma: కివీస్‌తో వన్డే, టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • Share this:
టీమిండియా కివీస్ పర్యటన (India vs New Zealand) ఐదు టీ20ల సిరీస్ క్లీన్ స్వీప్ తో శుభారంభం చేసింది. కాగా ఇప్పుడు రెండు జట్ల మధ్య వన్డే ఫ్లార్మాట్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ మూడు వన్డేలకు బీసీసీఐ(BCCI) ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. అయితే ఈ వన్డే సిరీస్ టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పిక్క కండరాలు పట్టేయడంతో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన జారీ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ఐదో టీ20(5th T20I Cricket)లో రోహిత్ (Rohit Sharma) 41 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సులతో 60 పరుగులు చేసి పిక్క పట్టేయడంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టుకు దూరం కావడం టీమ్ పెర్ఫార్మన్స్ పై ప్రభావం చూపవచ్చని వార్తలు వస్తున్నాయి. అటు టీమిండియా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే రోహిత్ శర్మ స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారు అనేది స్పష్టం కాలేదు. మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్ పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ యువ ఓపెనర్ పృథ్వీ షా పేరు కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెల 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

(India vs New Zealand) వన్డే సిరీస్ అనంతరం ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇక ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. దీనితో కివీస్ టూర్ ని ముగించుకొని స్వదేశానికి చేరుకుంటుంది. ఇదిలా ఉంటే వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి. ఇక టెస్ట్ మ్యాచ్‌లు భారత కాల మానం ప్రకారం ఉదయం 4 గంటలకి మొదలవుతాయి. ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా కివీస్ పర్యటనలో అజేయంగా పూర్తి చేసుకొని విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ మరోరికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 14 వేల పరుగులు చేసిన ఎనిమిదవ భారతీయ ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు. న్యూజిలాండ్ తో (India vs New Zealand) జరుగుతున్న ఆఖరి ఐదవ టీ20(IND vs NZ 5th T20I) రోహిత్ శర్మ ఈ ఫీట్ ను అందుకున్నాడు. రోహిత్ (Rohit Sharma) కంటే ముందు భారత్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ పరుగులతో ఉన్నారు. ఇదే సిరీస్‌లో రోహిత్ శర్మ ఓపెనర్ గా 10 వేల రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు