IND vs AUS 1st ODI: ఆస్ట్రేలియాలో రోహిత్ సెంచరీ చేస్తే అంతే సంగతులు...

ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ సెంచరీ సాధించకపోతేనే మంచిదని అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 12, 2019, 6:08 PM IST
IND vs AUS 1st ODI: ఆస్ట్రేలియాలో రోహిత్ సెంచరీ చేస్తే అంతే సంగతులు...
రోహిత్ శర్మ ఫైల్ ఫోటో (BCCI/Twitter)
news18-telugu
Updated: January 12, 2019, 6:08 PM IST
రోహిత్ శర్మ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఏకపక్షంగా ముగియడం ఖాయం. వన్డే చేజింగ్‌ల్లో హిట్ మ్యాన్ సెంచరీ చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు సునాయాసంగా నెగ్గిన సందర్భాలే ఎక్కువ. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం రోహిత్ వన్డే ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్ చేసిన ప్రతీ సారి టీమిండియాకు ఓటమి తప్పలేదు. సిడ్నీ వన్డేలో రోహిత్ సెంచరీ చేసినా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడింది. గత నాలుగేళ్ల నుంచి ఇదే రిపీట్ అవుతూ వస్తోంది. 2015లో మొదలైన ఈ సెంటిమెంట్ సిడ్నీ వన్డేలోనూ కొనసాగింది. తొలి వన్డేలో విరాట్ సేన ఓటమికి కారణాలెన్ని ఉన్నా...ఫైటింగ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ‌పై క్రికెట్ ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అయినా హిట్ మ్యాన్ మాత్రం ఓ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ టీమ్‌పై రోహిత్ చేసిన సెంచరీలు:
138-మెల్‌బోర్న్ (2015) - ఓటమి

171 నాటౌట్- పెర్త్ (2016) - ఓటమి
124 బ్రిస్బేన్ (2016)- ఓటమి


133 సిడ్నీ (2018) - ఓటమి
Loading....
2015,మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన వన్డేలో 138 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2016లో పెర్త్‌లోని వాకా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో 171 పరుగులు చేశాడు. అప్పుడు కూడా టీమిండియా నెగ్గలేదు. అదే సిరీస్‌లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన వన్డేలో మరోసారి 124 పరుగులు చేశాడు, ఫలితం భారత్‌కు అనుకూలంగా రాలేదు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 129 బంతుల్లో 133 పరుగులు చేసినా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయలేకపోయాడు.

ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ టీమ్‌పై రోహిత్ వన్డేల్లో సెంచరీ చేసిన నాలుగు సార్లు భారత జట్టుకు కలిసి రాలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ అదే సీన్ రిపీట్ అవ్వడంతో...హిట్‌ మ్యాన్ శతకం సాధించకపోతేనే బెటర్ అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మిగతా రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి టీమిండియాను ఖచ్చితంగా గెలిపిస్తాడని మరికొంతమంది ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ సెంటిమెంట్‌ను రోహిత్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి.


First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు