9 వేల పరుగుల క్లబ్బులో రోహిత్ శర్మ...అరుదైన రికార్డు అందుకున్న హిట్ మ్యాన్

అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ( 194), ఎబి డెవిలియర్స్(208)తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.

news18-telugu
Updated: January 20, 2020, 10:23 PM IST
9 వేల పరుగుల క్లబ్బులో రోహిత్ శర్మ...అరుదైన రికార్డు అందుకున్న హిట్ మ్యాన్
(Image: BCCI)
  • Share this:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్ (218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ( 194), ఎబి డెవిలియర్స్ (208) తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. రోహిత్ తర్వాత గంగూలీ (228), సచిన్ టెండూల్కర్ (235), బ్రియాన్ లారా (239)లు వరసగా ఉన్నారు. బెంగుళూరు వన్డేలో తొలి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు సాధించి 9000 పరుగుల క్లబ్‌లో చేరాడు.First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు