• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • ROHIT SHARMA CAUGHT ON CAMERA WHILE EATING DURING SECOND T20I LEAVES FANS IN SPLITS VIDEO GOES VIRAL SRD

Viral Video : మ్యాచ్ మధ్యలో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన రోహిత్..ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు..

Photo Credit : Twitter

Viral Video : ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆడని రోహిత్ శర్మ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురవుతున్నాడు. గతంలో ఫిట్ నెస్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ పై మరోసారి నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

  • Share this:
    ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మోర్గాన్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (46; 35 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (2/29), శార్దూల్‌ ఠాకూర్‌ (2/29) సత్తాచాటారు. ఛేదనలో విరాట్ కోహ్లీ (73 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాలతో టీమిండియాకు విజయాన్ని అందించారు. భారత్‌ 3 వికెట్లు కోల్పోయిన 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆడని రోహిత్ శర్మ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురవుతున్నాడు. గతంలో ఫిట్ నెస్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ పై మరోసారి నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. వడపావ్ కోసమే రోహిత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. రెండో టీ20లో ఈ ముంబైకర్ చేసిన పనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో ఆడుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

    ఇక ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్లతో గెలుపొంది 5 టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ.. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ చాటున నక్కినక్కి ఏదో తినడం కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సహచర ఆటగాళ్లు మైదానంలో కష్టపడుతుంటే, నువ్వేంటి రోహిత్‌ ఇలా అని ఒకరంటే.. వడాపావ్ కోసమే రెస్ట్ తీసుకున్నట్లున్నాడని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. తిండి మీదున్న సోయి ఫిట్‌నెస్ మీద లేదని మరొకరు విమర్శించారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.






    మరోవైపు రోహిత్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్‌ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని, కానీ కావాలనే ఈ స్టార్‌ ఓపెనర్‌ను తప్పించి కోహ్లీ "గేమ్స్‌" ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్‌ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు టీ20ల నుంచి రోహిత్‌ శర్మకు టీమ్‌మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. అయితే రోహిత్ గైర్హాజరీలో బరిలోకి దిగిన భారత్ తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దాంతో రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాడికి విశ్రాంతినిస్తారా? అని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
    Published by:Sridhar Reddy
    First published: