టీ 20 ప్రపంచకప్‌కు ముందు, రోహిత్ శర్మ వన్డే,టీ 20 కెప్టెన్‌గా ఉంటాడనే విషయం భారత క్రికెట్ చర్చనీయశంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి టీ 20,వన్డే జట్టు కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించనున్నట్లుగా బీసీసీఐ చెప్పినప్పటికి కోహ్లీ వైఫల్యం చెందుతున్న కారణంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీని వదిలి తన బ్యాటింగ్‌పై దృష్టి పెడతాడని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
గత కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నట్లుగా రకరకాలు ఊహాగానాలు వెలుపడుతున్న నేపథ్యంలో కోహ్లి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లినే స్వయంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని బీసీసీఐ పెద్దల ముందుంచినట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాట్లలకు తనే కెప్టెన్‌గా ఉండడం ద్వారా బ్యాటింగ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని కోహ్లి భావిస్తున్నాడు.
కోహ్లీ బ్యాటింగ్‌పై ప్రభావం
మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రభావితమవుతుంది. కోహ్లీ నవంబర్ 2019 లో టెస్టుల్లో తన చివరి సెంచరీ సాధించాడు. అన్ని ఫార్మాట్లలో తన బ్యాటింగ్‌ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోహ్లీ భావిస్తున్నాడు. భారత్ 2022 - 23 మధ్య, టీమ్ ఇండియా రెండు ప్రపంచకప్‌లు (వన్డే , టీ 20) ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో, కోహ్లీ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం ముఖ్యం. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యత అతని బ్యాటింగ్‌పై అధికంగా ఉందని కోహ్లీ భావిస్తున్నాడు
ఈ నేపథ్యంలో విరాట్.. ధోనీ అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయం తీసుకన్నాడు. ధోనీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేయబోతున్నాడు. అతను కెప్టెన్సీ బాధ్యతను రోహిత్‌తో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించడానికి బీసీసీఐ సుముఖంగా
ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Rohith sharma, Virat kohli