IND vs AUS 1st ODI: విరాట్ కొహ్లీని మించిపోయిన రోహిత్ శర్మ

ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డ్‌ సైతం బ్రేక్ చేశాడు.

news18-telugu
Updated: January 12, 2019, 8:02 PM IST
IND vs AUS 1st ODI: విరాట్ కొహ్లీని మించిపోయిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ (BCCI/Twitter)
news18-telugu
Updated: January 12, 2019, 8:02 PM IST
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ సెంచరీ చేస్తే రికార్డ్‌లు బద్దలవుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే‌లో ఫైటింగ్ సెంచరీతో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నాడు. తొలి వన్డేలో భారత్ ఓడినా...రోహిత్ మాత్రం హాట్ టాపిక్‌గా మారాడు. టీమిండియాను గెలిపించలేకపోయినా 'హిట్‌ మ్యాన్' పోరాటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సిడ్నీ వన్డే సెంచరీతో తన స్టామినా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేశాడు రోహిత్. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని సైతం అధగమించాడు. వన్డేల్లో ఎక్కువ సార్లు 125+ పరుగులు నమోదు చేసిన క్రికెటర్ల జాబితాలో విరాట్‌ను అధిగమించి ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

సిడ్నీ వన్డేలో 289 పరుగుల లక్ష్య చేధనలో 4 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ధోనీతో కలిసి రోహిత్ ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు ధోనీతో కలిసి 171 బంతుల్లో 137 పరుగులు జోడించాడు. ధోనీ ఔటయ్యాక...దినేష్ కార్తీక్, జడేజా సైతం విఫలమైనా...రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు.110 బంతుల్లో వన్డేల్లో 22వ సెంచరీ నమోదు చేసి జట్టును పోటీలో నిలిపాడు. 129 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు 133 పరుగులు చేశాక రోహిత్ ఔటవ్వడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.

వన్డేల్లో ఎక్కువ సార్లు 125+ పరుగులు నమోదు చేసిన క్రికెటర్లు:

సచిన్ టెండుల్కర్ 19


రోహిత్ శర్మ 14
విరాట్ కొహ్లీ 13
Loading....
సనత్ జయసూర్య 10
క్రిస్ గేల్ 10


వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లు
సచిన్ టెండుల్కర్ 9 (70 ఇన్నింగ్స్‌లు)
రోహిత్ శర్మ 7 (29 ఇన్నింగ్స్‌లు)
హేన్స్ 6 (64 ఇన్నింగ్స్‌లు)
విరాట్ కొహ్లీ 5(27 ఇన్నింగ్స్‌లు)


ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ టీమ్‌పై రోహిత్ చేసిన సెంచరీలు:
138-మెల్‌బోర్న్ (2015) - ఓటమి
171 నాటౌట్- పెర్త్ (2016) - ఓటమి
124 బ్రిస్బేన్ (2016)- ఓటమి
133 సిడ్నీ (2015) - ఓటమి


ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్
రోహిత్ శర్మ - 4 ( 17 ఇన్నింగ్స్‌లు)
వివియన్ రిచర్డ్స్- 3 ( 38 ఇన్నింగ్స్‌లు)


ఆస్ట్రేలియా గడ్డపై ఓ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన నాలుగు సార్లు భారత జట్టు ఓడింది. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యదిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్‌గానూ ఘనత సాధించాడు హిట్ మ్యాన్.


First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు