Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు...14 వేల పరుగుల క్లబ్బులో మరో భారతీయుడు

Rohit Sharma: ఈ మ్యాచులో రోహిత్‌శర్మ(Rohit Sharma) అరుదైన వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 స్కోరు దాటిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ఇప్పటికే 24 సార్లు 50 పరుగుల స్కోరు దాటిన కెప్టెన్ విరాట్ కోహ్లీని(Virat Kohli) ఈ రోజు వెనక్కు నెట్టడం విశేషం.

news18-telugu
Updated: February 2, 2020, 9:57 PM IST
Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు...14 వేల పరుగుల క్లబ్బులో మరో భారతీయుడు
టీమిండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు ప్రతిపాదించింది బీసీసీఐ.
  • Share this:
Rohit Sharma: న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20 లో రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. చివరి 5వ టీ20లో కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి బ్యాటుతో తన సత్తా చాటాడు. ఈ మ్యాచులో రోహిత్ 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచులో రోహిత్‌శర్మ(Rohit Sharma) అరుదైన వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 స్కోరు దాటిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ఇప్పటికే 24 సార్లు 50 పరుగుల స్కోరు దాటిన కెప్టెన్ విరాట్ కోహ్లీని(Virat Kohli) ఈ రోజు వెనక్కు నెట్టడం విశేషం. ఈ హాఫ్ సెంచరీతో రోహిత్ టీ20ల్లో 25 సార్లు 50కు పైగా స్కోర్ చేశాడు. కాగా రోహిత్ సాధించిన ఈ అరుదైన ఫీట్ లో మొత్తం నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు చేశాడు కానీ ఒక్క సెంచరీ కూడా బాదక పోవడం గమనార్హం. కోహ్లీ తర్వాత మార్టిన్ గుప్తిల్ , పాల్ స్టిర్లింగ్ 17 సార్లు 50 కు పైగా స్కోరు చేశారు.

అయితే ఇదే మ్యాచులో రోహిత్ శర్మ మరోరికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 14 వేల పరుగులు చేసిన ఎనిమిదవ భారతీయ ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి ఐదవ టీ20(IND vs NZ 5th T20I) రోహిత్ శర్మ ఈ ఫీట్ ను అందుకున్నాడు. రోహిత్ (Rohit Sharma) కంటే ముందు భారత్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ పరుగులతో ఉన్నారు. ఇదే సిరీస్‌లో రోహిత్ శర్మ ఓపెనర్ గా 10 వేల రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

ఇదిలా ఉంటే మౌంట్ మాంగనుయ్ లో భారత్ జట్టు ఐదో టీ20(India vs New Zealand) మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓటమి పాలైంది. ఐదు టీ20ల సిరీస్ లో కివీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ తో కెప్టెన్ కోహ్లీ సైతం రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ అత్యధిక టీ20 సిరీస్‌లు గెలిచిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో టీ20 సిరీస్‌లు గెలవడం విశేషం. కాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి 5వ టీ20 మ్యాచ్ లో మెరుపు బౌలింగ్ తో నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం విశేషం. అయితే ఇదే సిరీస్ లో 224 పరుగులతో సత్తా చాటిన టీమిండియా ఓపెనర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.
First published: February 2, 2020, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading